కెసీఆర్ ఫామ్ హౌజ్ వద్ద ఉద్రిక్తత.. డబుల్ బెడ్ రూం లబ్దిదారుల ఆందోళన
posted on Apr 12, 2024 @ 12:49PM
అధికారంలో ఉన్న రాజకీయపార్టీలు ఎన్నికల హామీలు, వాగ్దానాలను అమలుపరచకపోతే నిరసనలు, ధర్నాలు జరపడం సర్వ సాధారణం. కానీ తెలంగాణలో అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీ తమ ఎన్నికల వాగ్దానాలు, హామీల మీద ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు స్వంత నియోజకవర్గంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమమైన డబుల్ బెడ్ రూం లబ్దిదారులు రోడ్డెక్కారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గజ్వేల్ కు చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఫామ్ హౌస్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. లక్కీ డ్రాలో 1,100 మంది పేర్లను తీశారని...వీరిలో ఒక్కరికి కూడా ఇంత వరకు డబుల్ బెడ్రూమ్ ఇంటిని అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసీఆర్ వరుసగా మూడుసార్లు గజ్వేల్ నియోజక వర్గం నుంచి గెలుపొందారు. అయితే పదేళ్ల తర్వాత బిఆర్ ఎస్ ఓడిపోయినప్పటికీీ లబ్దిదారులు బాధపడటం లేదు. కెసీఆర్ డ్రా తీసిన లబ్దిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వడం లేదని బాధపడుతున్నారు. డ్రాతీసిన వ్యక్తి ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారని వారి వాదన.వీరిలో ఒక్కరికి కూడా ఇంత వరకు డబుల్ బెడ్రూమ్ ఇంటిని అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు, ఒంటేరులను కలిసినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. అధికారుల చుట్టూ కాళ్లు అరిగిపోయేలా తిరిగామని... ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ లో ఉన్న తాము ఏం పాపం చేసుకున్నామని ప్రశ్నించారు. తాము ఇక్కడకు వచ్చి ఎంతో సేపు అవుతున్నా కేసీఆర్ నుంచి కనీస స్పందన కూడా రాలేదని చెప్పారు. గేట్ వద్ద ఉన్న తమకు ఫామ్ హౌస్ లోపల నుంచి ఫోన్ కాల్ కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.