ఎపి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
posted on Apr 12, 2024 @ 1:22PM
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ప్రకటించారు. మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఈ వివరాలను కూడా వెల్లడించారు. అయితే, పరీక్ష ఫీజులు, గడువు తేదీ వంటి వివరాలను తెలపాల్సి ఉంది. కాగా ఏపీ ఇంటర్మీడియెట్ ఫలితాలను బోర్డు అధికారులు శుక్రవారం 11 గంటలకు విడుదల చేశారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీసులో బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఫలితాలను రిలీజ్ చేశారు.
ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేయగా కృష్ణా ప్రథమ, గుంటూరు ద్వితీయ, ఎన్టీఆర్ జిల్లా తృతీయ స్థానాల్లో నిలిచాయి. http://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌లో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు కాసేపటి క్రితం వెల్లడయ్యాయి. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.
ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్ పరీక్షలను 4,99,756 మంది విద్యార్థులు రాయగా 67 శాతం, సెకండియర్ పరీక్షలకు 5,02,394 మంది హాజరుకాగా 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ పరీక్ష రాసిన 38 వేల మందిలో 71 శాతం మంది పాసయ్యారు.