గెలుపు వాకిట తెలుగుదేశం.. తేల్చేసిన అంతర్గత సర్వే
posted on Jul 28, 2022 @ 12:31PM
వచ్చే ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంబించింది.అందుకోసం పార్టీ నిర్వహించిన అంతర్గాతసర్వే లో వచిన్న పలితాలు మంచిగా రావడం తో పార్టీ శ్రేణులు ఉత్సాహం గా ఉన్నారు. అదే ఉత్సాహాన్ని ఎన్నికల వరకూ కొనసాగించే విధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వరుస కార్యక్రమాలతో రాష్ట్రం చుట్టేస్తున్నారు. ఆయన పర్యటనలతో దేశం శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. ఆయన పర్యటనలకు వస్తున్న జనస్పందన చూస్తుంటే విజయం తథ్యమన్న భావన కలుగుతోందని తెలుగు దేశం శ్రేణులు అంటున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు అధినేత చంద్రబాబు ఒకవైపు చెమటోడుస్తుంటే, కొందరు పార్టీ సీనియర్లు మాత్రం పెద్దగా స్పందన లేకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఆయన తమ ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు ఏదో కొంత హడావుడి చేయడం తప్ప పెద్దగా పార్టీ కోసం శ్రమ పడటానికి సుముఖత వ్యక్తం చేయడం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పని చేయని నేతలను పక్కన పెట్టాలని శ్రేణుల నుంచి డిమాండ్ వస్తున్నది.
రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా తెలుగుదేశం పార్టీ పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. విజయావకాశాలున్న నియోజకవర్గాల్లో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని శ్రేణులకు అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలు పెట్టుకుని నిర్లిప్తంగా ఉండొద్దని, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకుని ప్రజలలో మమేకం కావాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
తన జిల్లాల పర్యటనల్లో కూడా పార్టీ క్యాడర్ కు సమయం కేటాయిస్తూ కార్యాచరణపై దిశా నిర్దేశం చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. పార్టీ శ్రేణులు కష్టపడి పని చేస్తే వచ్చే ఎన్నికలలో సునాయాసంగా 79 నియోజకవర్గాలలో పార్టీ విజయం సాధిస్తుందని అంతర్గత సర్వేలో వెల్లడైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవి గత ఎన్నికలలో పార్టీ విజయం సాధించిన 23 స్థానాలకు అదనం. అంటే పార్టీ అంతర్గత సర్వేను బట్టి వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 102 నియోజకవర్గాలలో విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంతర్గత సర్వేలో వెల్లడైందని అంటున్నారు.
ఈ నియోజకవర్గాలన్నీ గత ఎన్నికల్లో కేవలం వెయ్యి నుంచి 2వేల ఓట్ల తేడాతో చేజార్చుకున్నవేనని, ఈ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలుగుదేవం అధినేత క్యాడర్ కు సూచిస్తున్నారు. ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా పనిచేయాలంటూ చంద్రబాబు నాయకులు, కార్యకర్తలకు ఉద్భోదిస్తున్నారు. సమాచారం. ఇవి కాక వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తోన్న నేతల నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టిపెట్టాలని అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విజయం సునాయాసమని భావిస్తున్న నియోజకవర్గాలతోపాటు వ్యూహాత్మకంగా పని చేస్తే 45 నియోజకవర్గాల్లో కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అధినేత భావిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాలు, ఈ 45 నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతాయని అంటున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు నడుస్తుందని అంచనా వేస్తున్నారు. పొత్తులు కుదిరితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడుతుందని అంటున్నారు. పొత్తులతో సంబంధం లేకుండా ఒంటరిగా వెళ్లినా ఘన విజయం సాధించగలిచగలమని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని పార్టీ శ్రేణులు అధినేతకు సూచిస్తున్నారు. అయితే పొత్తుల విషయం పక్కన పెట్టి పార్టీని ఒంటరిగానే గెలుపు తీరాలకు చేర్చేలా పార్టీని సమాయత్తం చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ముందుగా ప్రకటించిన అభ్యర్థులు, ఇన్ ఛార్జిలుగా ఉన్నవారు తమ పనితాము చేసుకుంటూ వెళ్లాలని బాబు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గెలుపు వాకిట తెలుగుదేశం పార్టీ నిలబడిందని, నాయకులు, కార్యకర్తలు అనుసరించే విధానాలను బట్టి ఫలితాలు ఆధారపడివుంటాయని, ఎట్టి పరిస్థితుల్లోను అలసత్వానికి తావులేకుండా వ్యవహరించాలని ఆదేశించారు. పొత్తులతో సంబంధం లేకుండా ముందుగా ఎవరి పని వారు చేసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు.