ఒక సిరంజ్..30మంది విద్యార్దులకు ఇంజక్షన్!
posted on Jul 28, 2022 @ 12:31PM
ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఎవరూ అనారోగ్యం కోరి తెచ్చుకోరు. కానీ సిరంజ్‌లు కొరతవల్లో, మరే కారణం చేతనో మధ్యప్రదేశ్‌లో ఏకంగా 30 మంది విద్యార్ధులకు ఒకే సిరంజ్‌తో ఇంజక్షన్ ఇచ్చారు! మరి ఆ పిల్లల్లో, వారి తల్లిదండ్రుల్లో లేని భయాన్ని సృష్టించారు. దీనికి ప్రభుత్వం, ఆరోగ్యశాఖ అధికారులు సమాధానం చెప్పాలి. కేవలం ఆ క్యాంప్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటే సరిపోతుందా?
అసలే కోవిడ్ మహమ్మారి ఇంకా భయపెడుతూనే ఉంది. ఇపుడు మంకీపాక్స్ అనేది విస్తరిస్తోంది. రోజు రోజుకీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దగ్గు తమ్ము, జలుబు.. జ్వరం.. అన్నీ వెరసి మంచాన పడేస్తున్నాయి. కాస్తంత నీరసంగా, ఒళ్లు నొప్పులు పట్టి నా డాక్టర్లు వేయి జాగ్రత్తలు చెప్పడంతో పాటు గుప్పెడు మందులిచ్చి మరీ భయపెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కోవిడ్-19 ఇంజక్షన్ ఇపుడు స్కూలు విద్యార్ధులకు మరింత వీలు కల్పిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో అన్నిరాష్ట్రాల్లోనూ విద్యార్ధులకు కోవిడ్ పరీక్షలు, ఇంజక్షన్‌లు ఇవ్వడం ముమ్మ రంగానే సాగుతోంది. కానీ ఎక్కడికక్కడ ఏర్పాట్లు కట్టుదిట్టంగానే తీసుకుంటున్నారు.
మధ్యప్రదేశ్ లో కూడా ఆరంభమయ్యాయి. కానీ మధ్యప్రదేశ్ సాగర్ సిటీలో ని ఒక స్కూల్లోనే ఇంజక్ష న్‌లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ సిరంజ్‌లు తగినన్ని లేకపోవడమే చిత్రం. స్కూలు అన్నపుడు చాలామంది పిల్లలు ఉంటారు, అందరికీ ఇంజక్షన్‌లు ఇవ్వాలి. కానీ సిరం జ్‌లు ఎన్ని అవసరమవుతాయన్న అంచనా లేకుండానే కార్యక్రమానికి సిద్ధపడ్డారు. కోవిడ్ వాక్సికేషన్ ఆషా మాషీ వ్యవహారం కాదని ఆ క్యాంప్ నిర్వాహకులకూ తెలుసు కానీ నిర్లక్ష్యం వహించారు. ఇది బొత్తిగా క్షంతవ్యం కాదు. ఒకే ఒక్క సిరంజ్‌తో ఏకంగా ముపపయిమంది విద్యార్ధులకు ఇంజక్షన్ ఇవ్వడానికి ఎలా సిద్ధపడ్డారన్నది అందర్నీ ఆశ్చర్యపరిచింది. జరిగిన తర్వాత అలా ఎలా చేశారని ఇపుడు ప్రశ్నించుకోవ డం, ఆ క్యాంప్ నిర్వాహకులపై కఠినచర్యలు తీసుకుంటామని అనడంలో అర్ధం లేదు.
సాగర్ సిటీలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంప్ సమయంలో ఈ ఘటన జరిగింది. 30మంది విద్యార్థులకు ఒకే సిరంజీతో వ్యాక్సిన్ తీసుకుంటుండటం చూసిన పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన ఏఎన్ఎమ్ జితేంద్ర రాయ్.. స్పందిస్తూ తనకు డిపార్ట్‌మెంట్ హెడ్ నుంచి ఒకేసిరంజీతో వ్యాక్సిన్ వేయాలంటూ ఆదేశాలు అందాయని పేర్కొన్నాడు. వాళ్లు కేవలం ఒక సిరంజీ మాత్రమే ఇచ్చారు. నేనడిగితే అదే చెప్పారు. అందుకే 30మంది విద్యార్థులకు ఒకే సిరంజీతో వ్యాక్సిన్ ఇచ్చాను అని పేర్కొన్నాడు.
సాగర్ జిల్లా యాజమాన్యం ఈ ఘటన గురించి జితేంద్రపై ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక సూదిని ఒక్కసారే ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనను అతిక్రమించడం పట్ల కేసు ఫైల్ అయింది. శాఖాపర విచారణ జరుపుతున్నామని.. వ్యాక్సిన్లు పంపేందుకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డా. రాకేశ్ రోషన్ ఎంక్వైరీకి ఆదేశించారని అన్నారు.
కానీ ఇలా క్యాంపులు చేపట్టి విద్యార్ధుల్లో, తల్లిదండ్రుల్లో లేని భయాలు కల్పించారనే అనాలి. ఒకే సిరం జ్‌ని వినియోగించి 30 మందికి ఇంజక్షన్‌లు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదమేమిటన్నది ఇపుడు వారిని భాయందోళనకు గురిచేస్తోంది. ఇలా చేస్తే విపరీతాలు జరిగే ప్రమాదం ఉందా లేదా అన్నది ఇంతవరకూ కేంద్రం, ఆరోగ్య శాఖ కూడా ఎలాంటి సూచనలూ చేయలేదు.