బెజవాడలో కలకలకం..టీడీపీలోకి దేవినేని నెహ్రూ..?
posted on Aug 3, 2016 @ 9:53AM
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు భారీ స్కెచ్ గీసింది. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఇప్పటికే వైసీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం కృష్ణాజిల్లాకి చెందిన కీలకనేత, విజయవాడ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన దేవినేని నెహ్రూ తిరిగి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ చీలక సమయంలో ఎన్టీఆర్ తరపున నిలబడ్డారు దేవినేని. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి జనం సమాధి కట్టడంతో నెహ్రూ రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడింది. ఈ నేపథ్యంలో తిరిగి మళ్లీ తన సొంతగూటికి చేరేందుకు సిద్ధమవతున్నారు. నెహ్రూతో పాటే కృష్ణాజిల్లాకే చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ కూడా టీడీపీ వైపు చూస్తున్నారు.