తెలంగాణ సభ విజయవాడలో..!!
posted on Sep 7, 2013 @ 3:14PM
హైదరాబాద్ లో సమైక్యాంధ్ర సభ పెట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం అదే విధంగా విజయవాడలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసే సభకు ఇదేవిధంగా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు అనుమతివ్వకుంటే వారి నీతి ఏంటన్నది తేలిపోతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ తేల్చిచెప్పింది. ఈ రోజు హైదరాబాద్ వచ్చిన ఏపీ ఎన్జీఓలు తెలంగాణ విద్యార్థుల మీద, నేతల మీద, జర్నలిస్టుల మీద దాడులు చేశారని దీనికి ఎవరు భాద్యత వహిస్తారని ప్రశ్నించింది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డిలు తెలంగాణ ఉద్యమం మీద విషం చిమ్ముతున్నారని, విద్యార్థుల మీద దాడులు చేస్తున్నారని, తెలంగాణ విభజన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ ను పదేళ్ల ఉమ్మడి రాజధానిగా కాదు ఒక్క రోజు కూడా ఒప్పుకోమని, సమైక్యాంధ్ర అంటూనే ఇప్పుడు దాడులు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితిని అస్సలు ఒప్పకోమని తేల్చిచెప్పింది. తెలంగాణది ధర్మపోరాటం అని..తెలంగాణదే అంతిమ విజయం అని జేఏసీ స్పష్టం చేసింది.