ఇన్నేళ్లు ఆగారు.. కొన్నాళ్లు ఆగలేరా?

 

తెలంగాణపై ఎన్నో ఏళ్లు వేచి చూశారు. మరికొన్ని నెలలు వేచి చూడండి అని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే చిదంబరం అన్ని వర్గాలతో మాట్లాడినందున మరోసారి అలాంటి సమావేశం అవసరమౌతుందని తాను భావించడంలేదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ కు పరిష్కారం ఎప్పుడు వెలువరించేది తాను చెప్పలేనన్నారు. అది పార్లమెంట్ సమావేశాలకు ముందుకానీ, తర్వాత కానీ ఉండొచ్చన్నారు.