ఎమ్మెల్యే కుమారుడి కీచక పర్వం...!
posted on Nov 11, 2012 @ 10:26AM
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ శాసనసభ్యుడి తనయుడు కామంతో కళ్ళు మూసుకుపోయి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే కొడుకు తన అనుచరులతో కలిసి పదిహేడేళ్ల బాలికను అపహరించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితారాలి ఫిర్యాదు మేరకు ముజఫర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బిఎస్పీ ఎమ్మెల్యే మౌలానా జమీల్ అహ్మద్ కొడుకు నయీమ్, ఎమ్మెల్యే బావమరిది నామన్, మరో గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
బసారియా గ్రామం నుంచి ఆ మైనర్‌ను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. విషయం బయటపెడితే చంపేస్తామని నిందితులు బాధితురాలని హెచ్చరించారు. తన కొడుకుపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే అహ్మద్ ఖండించారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. నిందితుల్లో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు.