తెలంగాణాలో ఎస్టీ కోటా పెంపు...న్యాయపరీక్షకు నిలిచేనా?
posted on Oct 1, 2022 @ 11:50AM
తెలంగాణాలో షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ) లకు రిజర్వేషన్లు పదిశాతం పెంచారు. జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు ఈ రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 33 జారీ చేసింది. దీనితో రాష్ట్రంలో గిరిజనులకు శని వారం నవంబర్ 1 నుంచే ఈ కొత్త రిజర్వేషన్ అమలులోకి వచ్చాయి. వాస్తవానికి తెలంగాణాలోనే ఇతర రాష్ట్రాలకంటే గిరిజన జనాభా ఎక్కువ. ఇటీవలి కాలంలో 6 నుంచి 10 శాతానికి ఆ జనాభా పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు జరిగిన అన్యాయాల దృష్ట్యా వారికి ప్రత్యేక నిధిని కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసి భారీ నిధులు కేటాయించింది.
రిజర్వేషన్ల పెంపు విషయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎస్.చెల్లప్ప నేతృత్వంలో కమిషన్ వేశారు. ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను 2017లో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన రోజునే అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి కేంద్రప్రభుత్వానికి పంపడం జరిగింది. కానీ కేంద్రం చాలాకాలం దాన్ని తొక్కిపెట్టింది. ఈ కారణంగా నే రాష్ట్రప్రభుత్వం చొరవతీసుకుని స్వయంగా ఈ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకుంది.
నిధులు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఖర్చు చేయాలని, ఒకవేళ ఖర్చు చేయలేకపోతే తర్వాతి సంత్సరానికి బదిలీ (క్యారీ ఫార్వర్డ్) చేయాలని నిర్ణయించి ప్రభుత్వం అమలు చేసింది. ఎస్టీలకు గురు కులాలు ఏర్పాటుచేసి వారి విద్యాభివృద్ధికి కృషిచేసింది. అనేక ఇతర సౌకర్యాలు, భరోసా కల్పించినప్ప టికీ విద్య, ఉద్యోగాల్లో వెనకబడిపోయిన గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు అంశం అలాగే ఉండి పోయింది.
కాగా తెలంగాణాలో గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉండటం తో వారికి రిజర్వేషన్ కోటా పెంచాలని చెల్లప్ప కమిటీ సూచించటం ఇంకో ప్రత్యేక సందర్భం. సుప్రీంకోర్టు తీర్పులోని ‘ప్రత్యేక సందర్భం’ అనే మాటకు రాష్ట్రంలోని ఈ ప్రత్యేక సందర్భాలు కచ్చితంగా సరిపోలుతున్నాయి. 1994లో తమిళనాడులో రిజర్వేష న్లను 50 శాతానికి మించి అమలు చేస్తే, అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పించింది. 28 ఏళ్లుగా అక్కడ 69 శాతం రిజర్వేషన్లు నిరాఘా టంగా అమలవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పులోని ‘ప్రత్యేక’ వెసులుబాటు ఆధారంగా తెలం గాణ ప్రభుత్వం ఆరేళ్ల క్రితమే గిరిజనుల రిజర్వేషన్‌పెంపు బిల్లును శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపింది. పార్లమెం టులోనూ టీఆర్‌ఎస్ నేతలు గిరిజన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. అయినా కేం ద్రం స్పందించలేదు. దీంతో రాష్ట్రప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ శుక్రవారం జీవో జారీ చేసింది.