బుగ్గనా.. ఇది తగునా!
posted on Oct 1, 2022 @ 12:19PM
చిన్న మనవడి పెళ్లికి ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవడంలో నానా హైరానా పడుతోంది పెద్దా విడ. అన్నీ బాగానే ఉన్నాయి, అందరూ గొప్పగా ఉన్నాయని కొడుకు అంటూన్నా ఆమెకు నచ్చలేదెం దుకో, అన్నట్టు స్టీలీ బిందిలో పంచదార నీళ్లు తెప్పించాను ఇచ్చార్రా.. అసలే ఎండగా ఉంది కూడా నూ..అని ఎవర్నో పురమాయించింది పెద్దావిడ. చిత్రమేమంటే స్టీలు బిందెల్లో డోన్‌లో మాత్రం వైసీపీ అభిమానులకు ఇచ్చింది మాత్రం పంచదార నీళ్లయితే కాదు!
అసలే జనాల్లో పరువు పోతున్న సమయంలో కర్నూలు జిల్లా డోన్ మండలంలో వైసీపీ లోకి చేరడానికి కొం దరు ఉత్సాహపడి ఆ పార్టీ అధినేత, రాష్ట్రముఖ్యమంత్రి జగన్ పట్ల వీరాభిమానంతో వచ్చారు. ఆ అభి మానులను పార్టీలోకి ఆహ్వాని స్తున్న మంత్రి బుగ్గన ఆనందానికి అంతేలేదు. బుగ్గన సమక్షంలోనే డోన్ పరిధిలో చాలామంది వైసీపీలోకి చేరడానికి సిద్ధపడ్డారు. పెద్ద సభే జరిగింది. వచ్చినవారంతా బుగ్గనకి బొకేలిచ్చి పార్టీలో సభ్యత్వం తీసు కున్నారు.
కానీ సభ అక్కడితో ముగియలేదు. వచ్చినవారు బళ్లు వేసుకుని ఎండనపడి వచ్చారని మజ్జిగ ఇచ్చి నంత సులువుగా కర్ణాటక మద్యాన్ని అందించి వారిని ఆనందపరిచారు. పార్టీలోకి చేరడానికి కంటే ఎక్కువమంది ఈ ఊహించని ఆహ్వానానికి సంతసించి అభిమానులు విరగబడినట్టు సమాచారం. రాష్ట్రంలో మద్య నిషేధం అమలులోకి వచ్చిన సమయంలోనే పక్క రాష్ట్రం నుంచి తెప్పించి మరీ వేడు కగా చేసుకోవడంలో ఆంతర్యర్యమేమిటి?