తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ!

తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గచ్చిబౌలీ లేదా హైదరాబాద్ శివార్లలో వున్న హకీంపేటలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదించారు. స్పోర్ట్స్, మెడిసిన్, స్పోర్ట్స్ సైన్స్ సహా పన్నెండుకు పైగా కోర్సులు ఆ యూనివర్సిటీలో ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల దక్షిణ కొరియాలోని సియోల్‌లో కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని (కేఎస్ఎన్‌యూ) సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీలో భాగస్వా్మ్యానికి కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రాథమికంగా అంగీకరించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2028లో జరిగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.లో తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడాకారులు సత్తా చాటే విధంగా క్రీడా సదుపాయాల కల్పనలో సహకరించాలని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రను రేవంత్ రెడ్డి కోరారు.