కర్నూలు ప్రమాద ఘటన మృతులకు తెలంగాణ సర్కార్ ఎక్స్ గ్రేషియా
posted on Oct 24, 2025 @ 1:24PM
కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే క్షతగాత్రులకు ఒక్కొక్కరికీ రెండు లక్షల రూపాయల చొప్పున అందిచనున్నట్లు ప్రకటించారు.
అదే విధంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రైవేట్ బస్సుల మితిమీరిన వేగాన్ని నియంత్రించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. ఇందు కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో త్వరలోనే ఒక సమావేశం నిర్వహించనున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ సమావేశంలో ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాలు, వేగ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు.