తెలంగాణలో కొత్త రికార్డ్..
posted on Feb 11, 2021 @ 10:35AM
తెలంగాణలో కొత్త రికార్డ్.. దాదాపు సంవత్సర కాలంగా ప్రపంచమంతా కరోనా చేస్తున్న విలయతాండవం తెలిసిందే.. కరోనాకి ఎవరు అతిథులు కారని .. కరోనా కాటుకు అందరూ బలిఅవ్వాల్సిందే అన్నట్లుగా ప్రపంచంపై కరోనా విరుచుకుపడింది.. ఇంకా ప్రపంచంలో కరోనా పెనవేసుకొని ఉండగా.. తెలంగాణలో కరోనా కేసుల్లో కొత్త రికార్డు నమోదైంది. కరోనా నియంత్రణలో ముందడుగు వేస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖంతో పాటు..మరణాల సంఖ్య కూడా తగ్గిపోతోంది. అధికారిక లెక్కల ప్రకారం గురువారం కరోనాతో ఒక్క మరణం కూడా నమోదు కాలేదన్నారు.. దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గడిచిన 24 గంటల్లో తెలంగాణలో146 కరోనా కేసులు నమోదు కాగా.. ఒక్క మరణం కూడా సంభవించలేదు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,96,134కి చేరింది. 1,613 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 1,825 యాక్టివ్ కేసులు ఉన్నాయని, కరోనా చికిత్స నుంచి కోలుకుని 2,92,696 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. తెలంగాణలో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 765 మంది బాధితులు ఉన్నారని, జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 25 కరోనా కేసులు నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.