టిఆర్ఎస్ లీడర్ని.. నా కారునే ఆపుతారా.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో నేత వీరంగం
posted on Feb 11, 2021 @ 10:21AM
హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ టెట్లు చేస్తూ మందుబాబులను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ డ్రైవ్ లలో మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా మంగళవారం రాత్రి సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా రామ్‌కోఠి చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఆ సమయంలో హిమాయత్‌నగర్ నుంచి కాచిగూడ వెళ్తున్న ఏపీ 10 ఏఎస్ 3000 కారును పోలీసులు అడ్డుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఫుల్‌గా మద్యం సేవించిన కేపీ శ్రీకాంత్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తాను టీఆర్‌ఎస్ నాయకుడినని.. నా కారునే అడ్డుకుంటారా అంటూ పోలీసులపై చిందులేశాడు. పోలీసులకు అనుమానం వచ్చి కారు డోర్లు తెరిచి చూడగా డ్రైవర్ సీటు పక్కన, అలాగే వెనక సీట్లలో మద్యం సీసాలు కనిపించాయి. దీంతో పోలీసులు బ్రీత్ ఎనలైజర్ పెట్టి శ్రీకాంత్‌ను ఊదమని కోరగా, దాదాపు 45 నిమిషాల పాటు అతడు పోలీసులకు చుక్కలు చూపించాడు. దీంతో అతడిని సముదాయించిన పోలీసులు, అతడిపై కేసు నమోదు చేసి కార్‌ను స్వాధీనం చేసుకున్నారు.