తెలంగాణలో నిలిచిపోయిన ఆటోలు
posted on May 15, 2016 @ 5:04PM
రవాణాశాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు నిరసనగా తెలంగాణలో ఆటోవాలాలు సమ్మెబాట పట్టారు. హైదరాబాద్‌లో ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్ల అనధికార ధరల ప్రకారం ప్రయాణికులను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అక్రమంగా రవాణా వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ క్యాబ్ కంపెనీల జోలికి వెళ్లని అధికారులు ఆటో డ్రైవర్ల పట్ల కఠినంగా వ్యవహరించడం ఏ మాత్రం బాగోలేదన్నారు. అధికారుల తీరు వల్ల ఆటో డ్రైవర్ల జీవనం సంక్షోభంలో పడుతోందని తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. ఆటోల తనిఖీల సందర్భంగా లోపాలున్నట్లు తేలితే..పర్మిట్లు రద్దు చేస్తామంటూ పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. దీనిని నిరసిస్తూ నిన్న అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లుగా ప్రకటించింది.