ఇండో-చైనా బోర్డర్‌లో అలజడి..ప్రజలకు అనుమానాస్పద కాల్స్
posted on May 15, 2016 @ 6:01PM
గత కొన్ని రోజులుగా దేశ సరిహద్దు గ్రామాల ప్రజలకు అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తున్నాయి. భారత్-చైనా సరిహద్దులోని దర్బక్ గ్రామ సర్పంచ్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. సముద్ర మట్టానికి 13,500 అడుగుల ఎత్తులో ఉన్న ఛాంగ్‌లా, సంగేత్ గ్రామాల్లో పహారా కాస్తున్న ఆర్మీ సిబ్బంది వివరాలను ఆ ఫోన్ చేసిన వ్యక్తి అడిగాడు. తాను డిప్యూటీ కమిషనర్‌నని చెప్పాడు. ఆ సమయంలో ఆ సర్పంచ్ ఆకక్దీ ఆర్మీ క్యాంప్‌లోను ఉన్నాడు. దీంతో అప్రమత్తమైన ఆర్మీ అధికారులు విచారణ ప్రారంభించారు. అయితే డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి అలాంటి ఫోన్ కాల్ చేయలేదని తేలింది.
దీంతో విషయం కేంద్ర హోంశాఖ దృష్టికి వెళ్లింది. చైనా, భారత సరిహద్దుల వెంబడి భారీ స్థాయిలో సైనికులను మోహరిస్తుండటంతో ఆ ఫోన్ కాల్స్ చైనా నుంచి వస్తున్నాయా? లేక పాకిస్థాన్ నుంచి వస్తున్నాయా? అన్న కోణంలో భారత ఇంటెలిజెన్స్ అధికారులు శోధిస్తున్నారు. ఈ ఫోన్ కాల్స్ చేసిన వ్యక్తులు తాము సైనికాధికారులమని, ప్రభుత్వాధికారులమని చెబుతూ సరిహద్దుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వివరాలను అడుగుగున్నట్టు ప్రజలు తెలుపుతున్నారు.