ఉన్నది 18 రోజులు.. జరిగేది 10 రోజులు
posted on Sep 24, 2015 @ 11:30AM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 10 వరకూ ఈ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మొత్తం 18 రోజులు ఈ సమావేశాలు జరుగుతున్నట్టు కనిపిస్తున్న వాస్తవానికి 10 రోజులు మాత్రమే సమావేశాలు జరిగేలా కనిపిస్తున్నాయి. ఈ 18 రోజుల్లో ఉన్న సెలవుల్ని తీసేస్తే మిగిలేది 10 రోజులు. దీనికి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభను జరుపుకుందాం.. మాకేం పర్వాలేదు అని చెప్పడం గమనార్హం. ఈ పదిరోజులు కూడా సభలో వివిధ అంశాలపై చర్చ జరగడంకంటే గొడవలతోనే సగం సమయం అయిపోతుంది. మరోవైపు ప్రతిపక్షనేతలు మూకుమ్మడిగా అధికార పార్టీని ఇరుకున పెట్టాలని తమ వ్యూహాలలో తాము ఉన్నారు. ముఖ్యంగా రైతు ఆత్మహత్యలు.. ప్రాజెక్టుల రీ డిజైనింగ్.. పార్టీ ఫిరాయింపులపై.. ముఖ్యంగా తలసాని వ్యవహారం గురించి అధికార పక్షాన్ని ప్రశ్నించనుంది. అయితే అధికార పక్షం కూడా ఈ చర్చలకు సై అని.. తాము కూడా ఈ చర్చలకు రె"ఢీ" అంటూ చెప్పింది. కానీ కొన్ని అంశాలు అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్లు తీసివేయటం.. పార్టీ ఫిరాయింపులు.. మీద మాత్రం చర్చ జరపడానికి నో చెప్పింది. మొత్తానికి ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడిగా జరగనున్నట్టు తెలుస్తోంది.