ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు వారు..
posted on May 20, 2016 @ 4:54PM
ఎవరెస్ట్ ను అధిరోహించిన వారిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు రికార్డ్ సాధించారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఎఎస్పీగా పని చేస్తున్న జిఆర్ రాధిక, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భద్రయ్య ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. గత నెల 19వ తేదీన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి వెళ్లిన వీరు ఈరోజు ఉదయం విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. వీరిద్దరితో పాటు ఐపిఎస్ అధికారి సునీల్ శర్మ, దుబాయ్‌లో ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాలన్, ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రభాకరన్ కూడా ఉన్నారు. కాగా, రాధిక గతంలో 7,077 మీటర్ల ఎత్తున్న కూన్ పర్వతాన్ని కూడా ఆమె అధిరోహించారు. ఈ పర్వతాన్ని అధిరోహించిన రెండో మహిళగా ప్రపంచం రికార్డు నాడు నెలకొల్పారు.