విద్యార్థిని అంధున్ని చేసిన ఉపాద్యాయుడు?
posted on Aug 7, 2012 @ 12:41PM
ఓ విద్యార్థిని అంధున్ని చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇది విశాఖ జిల్లాలో జరిగింది. నాలుగోతరగతి చదువుతున్న నాగేంద్రను పాఠం అప్పజెప్పలేదని ఉపాద్యాయుడు కొట్టాడు. బెత్తంతో ఇష్టం వచ్చినట్లు కొట్టడంలో నాగేంద్ర కంటిపై కూడా దెబ్బలు పడ్డాయి. చూసుకోకుండా బెత్తం కంటికి తగిలింది. వెంటనే రక్తస్రావం అయింది. ఈ విషయాన్ని కూడా ఉపాద్యాయుడు గమనించలేదు. దీంతో మళ్లీమళ్లీ కొట్టేందుకు ఉపాద్యాయుడు వెళ్లగా రక్తస్రావమైనట్లు తెలిసింది. దీంతో నాగేంద్రను ఉపాద్యాయుడు తప్పనిసరి పరిస్థితుల్లో వదిలేశాడు. తాను కొట్టిన విషయం బయటకు చెప్పొద్దని కోరాడు. అయితే తల్లిదండ్రులు రక్తస్రావంతో వచ్చిన కుమారుడుని ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం వైద్యులు నాగేంద్రకు చూపు తెప్పించటం కష్టమని తేల్చేశారు.
దీంతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు అతనికి తామేమి చేయగలమో అని ఆలోచించారు. వైద్యానికి దారి లేకపోవటం వల్ల అంధునిగా మారిన నాగేంద్ర విషయంలో ఉపాద్యాయుడు తప్పు కూడా ఉందని తల్లిదండ్రులు నిర్ధారించుకున్నారు. దీంతో తమ కుమారుడు నాగేంద్రను తల్లిదండ్రులే ఉపాద్యాయునికి అప్పగించారు. ఇక నుంచి నాగేంద్రకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని ఉపాద్యాయుడిని తల్లిదండ్రులు కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాద్యాయుడే నాగేంద్రబాధ్యతను చేపట్టాడు.