తన బొమ్మగీయమంది..పదికి 5 మార్కులే ఇచ్చింది!
posted on Sep 19, 2022 @ 4:22PM
పిల్లలకు పాఠాలు చెప్పడం ఓ కళ. అది అందరికీ సాధ్యపడేది కాదు. బోర్డుమీద అఆలు, ఏబిసిడీలు రాసి వాటిని పలికించి, ఆ తర్వాత రాయించడమేగదా.. అనుకుంటారు. కానీ దీని కంటే టెన్త్‌పిల్లలకు మాథ్స్ చెప్పడం మహా తేలిక అంటారు అనుభవజ్ఞులు. ఒకటో తరగతి పిల్లలకు చెప్పడంలో మహా ఓపిక ఉండాలి. వాళ్లు వినేలాచేయాలి, వాళ్ల మాటలు వినాలి, వాళ్లతో ఆడాలి, పాడాలి. అయితే ఒక టీచర్ సరదాగా వాళ్లతో బొమ్మ వేయించుకుంది. ఒక పిల్లవాడు వేసిన బొమ్మ చూసి ఆశ్చర్యంతో అలా ఉండి పోయింది.
ఇస్లామాబాద్‌లో ఒక స్కూలుటీచర్. చిన్నతరగతులకు రోజంతా ఏవో వాళ్లచేత చెప్పిస్తూ, రాయిస్తూం డేది. వారికి విసుగు కలగకుండా, సరదాగా ఆడించాలనుకుంది. అపుడపుడు పాటలు పాడుతూ, క్లాస్ రూమ్ అంటే భయం లేకుండా చేసింది. తర్వాత తాను భయపెట్టే టీచర్‌ని కానని అనేక విధాలా సరదా కబుర్ల తో చెప్పింది. వాళ్లూ అర్ధం చేసుకున్నారు.
ఇలా కాదు, కేవలం పాఠాలు చెప్పడం కాకుండా క్లాస్‌రూమ్‌ని మరింత చక్కటి వాతావరణంలో చూడా లను కుంది. పిల్లల్లో బొమ్మలు వేసే నైపుణ్యం ఏమాత్రం ఉందీ తెలుసుకోవాలనుకుంది. అంతే వెంటనే పిల్ల లకు పిల్లలూ.. ఈ పూట పాఠం చెప్పను.. సరదాగా మీకు తోచిన చూసిన జంతువు, మనిషి బొమ్మ వేయండి. అంటూ అందరికీ కాయితాలిచ్చింది. పిల్లలకు పెన్సిల్ చెక్కి రబ్బరుతో సహా సిద్ధ పడ్డారు. అంతలో టీచర్ ప్లాన్ మార్చేసింది. ఏదీ కాదు.. నన్ను చూసి నా బొమ్మ వేయండి.. అని అడిగింది.
ఓ అరగంట క్లాస్‌రూమ్ అంతా ప్రశాంతంగా, పిన్‌డ్రాప్ సైలెన్స్‌గా ఉంది. ఎవరు కిసుక్కుమని నవ్వినా, పెన్సిల్ చెక్కినా వినపడేంత నిశ్శబ్డం అనమాట! అరగంట తర్వాత అందర్నీ కాయితాలు తెమ్మన్నది ఆ టీచర్. ఒక పిల్లవాడు టీచర్ బొమ్మ చాలా బాగా గీసాడు. .టీచర్ జుత్తు, డ్రస్ ఎలా ఉండేది కూడా సరిగ్గా దించేసాడు. అది చూసి ఆమెకు ఆశ్చర్యమేసింది. .వాడి ఊహాశక్తికి. వాడికి ఓ ముద్దిచ్చి, చాక్లెట్ బహుమానంగా ఇచ్చింది. కానీ అన్నట్టు పదికి 5 మార్కులు ఇచ్చింది. ఆ టీచర్ పేరు నిషాంత్.