పేరు టీచర్.. వృత్తి మోసం
posted on Mar 30, 2021 @ 10:05AM
అతను ఒక టీచర్.. కానీ పెద్ద చీటర్. అమాయకుల పాలిట ఘరానా దొంగ. మోసగాళ్లకు మోసగాడు. ప్లాట్స్ ఇప్పిస్తానంటూ జనాలకు పెద్ద కాటు వేశాడు. ఇలా చేయడం ఇది మొదటి సరి కాదు.. ఆయన వృత్తే మోసం చేయడంగా ఎంచుకున్నాడు. ఒకప్పుడు ఉపాధ్యాయులు ఊర్లోనూ, స్కూల్ లోనూ మంచి గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు కొంత మంది ఉపాధ్యాయులు ఆ వృత్తికే మచ్చ తెస్తున్నారు. ఒకప్పుడు ఉపాధ్యాయులు స్కూల్ లో పాఠాలు మాత్రమే చెప్పేవాళ్లు.. ఇప్పుడు అది తప్ప అని దందాలు చేస్తున్నారు. చిట్టీలు, రియల్ ఎస్టేట్, పైరెవీలు, ఇవే వారి ఆలోచన. విద్యార్థులు పాఠాలు అయినా మంచిపోతారు కానీ ఆ ఆలోచన మాత్రం మర్చిపోరు .
తాజాగా విశాఖ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి మోసాలు చేశాడు. బలిసినోడిని కాదు బలహీనుడిని మోసం చేశాడు.
ప్రతి మనిషి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని కల ఆ కలని ఈ ఉపాద్యాయుడు వలగా వాడుకున్నాడు.. అవసరమైన అమాయకులకు ఇళ్ల ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు మోసం చేశాడు. రమణబాబు అనే ప్రభుత్వ టీచర్ ఈ చీటింగ్‌కు చేశాడు. బాధితుల నుంచి రూ.19 లక్షలను అడ్వాన్స్ గా తీసుకుని చాటు మాటుగా తిరుగుతున్నారు. అటు ప్లాట్లు తీసుకోవాలనుకున్న కల తీరాక, రమణబాబు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఉపాధ్యాయుడుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రమణ బాబును అరెస్ట్ చేశారు. కాగా ఈ ఉపాధ్యాయుడు గతంలోనూ అదే తరహ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఘటనపై నర్సీపట్నం పీఎస్‌లో కేసు నమోదైనట్లు వెల్లడించారు.