టీడీపీ ట్విటర్ అకౌంట్ హ్యాక్.. వైసీపీ పనే?
posted on Oct 1, 2022 @ 3:37PM
ప్రజల్లో ప్రతిష్ట దెబ్బతిన్నతర్వాత వేగులతో విపక్షాలపై కక్షసాధింపు మార్గాలు ఆలోచించిన రాజుగారు దొం గల్ని తెల్లాగట్ల వెళ్లి పద్దు పుస్తకాలు ఎత్తుకు రమ్మని పంపించారు. వాళ్లు అలానే రాజుగారుర తమకు అప్పగించిన పనిని చాలా సిన్సియ ర్‌గా చేశారు. కానీ చిత్రమేమిటంటే చేసినవారంతా జై మహారాజా అని అరిచి మరీ వెళ్లడంతో ఆ వెధవ పని చేసింది రాజుగారేనని వెల్లడైపోయింది. గోడ మీద పిడకలా వారి పేర్లు బజార్న పడ్డాయి. ప్రతిష్ట మరింత దిగజారింది. ఇపుడు వైసీపీ పరిస్థితీ అలాగే తయారైంది.
రాష్ట్రంలో ఇప్పుడు తెలుగుదేశం పుంజుకుంటోంది. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగు దేశం ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి అన్నివిధాలా సమాయత్తమయింది. పార్టీలో ప్రతీ ఒక్కరూ సైనికుల్లా పనిచేస్తున్నారు. మరో వంక జగన్ సర్కార్ తన ప్రభుత్వ ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి, ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలనూ ఊడబీకేస్తానంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. కాగా విపక్షాల దూకుడుకి అడ్డుకట్టవేయాలని ట్విట‌్ల దాడి మొదలుపెట్టింది. అయినా లాభం లేకపోయింది. ఇక లాభం లేదని దొంగల్ని ప్రవేశపెట్టింది.
అంతే వారు రెచ్చిపోయి అమాంతం ముఖ్యమంత్రి ఆచ్చిన స్పూర్తితో తెలుగు దేశం ట్విటర్ లోకి దూకేశారు. పార్టీ ట్విటర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. ఇది తప్పకుండా వైసీపీ వ్యవహారమేనని లోకమంతా కోడై కూస్తోంది. ట్విట్టర్‌లో టీడీపీ అకౌంట్ కోసం టైప్ చేస్తే టైలర్ హబ్స్ అనే అకౌంట్ ఏకంగా జై టీడీపీ హ్యాండిల్ తో ప్రత్యక్షమవుతోంది. అంతేకాదు, ఆ ఖాతాలో టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్ కు చెందిన పోస్టులు దర్శనమిస్తున్నాయి.
దీనిపై ఐటీడీపీ స్పందిం చింది. తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాక్ అయ్యిందని దృవీకరించింది. తెలుగుదేశం ట్విట్లర్ అకౌంట్ ను అధికార వైసీపీ మద్దతు ఉన్న శక్తులు హ్యాక్ చేశాయని ఆరోపించింది. త్వరలోనే టీడీపీ అకౌంట్ ను పునరుద్ధరిస్తామని వెల్లడించింది.