టిడిపి ఎంపిల అరెస్ట్
posted on Dec 3, 2013 @ 4:45PM
కృష్ణా జలాల పంపిణీ విషయంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ రాష్ట్రానికి చేసిన అన్యాయం పై టిడిపి పోరాటాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి సహాపలువురు జాతీయనాయకులను కలిసి తెలుగు ప్రజలకు న్యాయ చేయవలసిందిగా కోరారు.
ఈపోరాటంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఎంపిలు ఢిల్లీలోని ప్రదాని నివాసం ముందు ఆందోళనకు దిగారు. నామా నాగేశ్వరరావు, సిఎం రమేష్, సుధారాణి, దేవేందర్ గౌడ్, సుజనా చౌధరి, నిమ్మల కిష్టప్పతో మరి కొంత మంది రాష్ట్రనాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అయితే ఆంధొళనకు దిగిన తెలుగుదేశం నాయకులను ఢిల్లీపోలీసులు అరెస్ట్ చేశారు.
ముందుగా కృష్ణా జలాల పంపిణీ విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రదానితో చర్చించటానికి టిడిపి ఎంపిలు అపాయింట్‌మెంట్ కోరగా అందుకు ప్రదాని కార్యాలయం వర్గాలు నిరాకరించాయి. దీంతో టిడిపి ఎంపిలు ప్రదాని కార్యలయం ముందు ఆందోళనకు దిగారు.