రాయల`టి`కి నిరసనగా బంద్
posted on Dec 3, 2013 @ 8:13PM
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చిన కేంద్రం కొరివితో తలగొక్కుంది. ఇన్నాళ్లు సీమాంద్ర ప్రాంతంలోని నిరసనలతోనే రాష్ట్రం అట్టుడికి పోతుంటే ఇప్పుడు తాజా రాయల తెలంగాణ ప్రతిపాదనతో మరోసారి తెలంగాణ ప్రాంతం కూడా భగ్గుమంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనను పలువురు తెలంగాణ వాదులు వ్యతిరేకించాగా తాజాగా కెసిఆర్ కూడా ఈ అంశంపై స్పందించారు.
రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా ఈ నెల 5న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు కెసిఆర్. తెలంగాణ ప్రజలు కేవలం పది జిల్లాల తెలంగాణ మాత్రమే కోరుకుంటున్నారని.. అది తప్ప వేరే ఏది అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కెసిఆర్ ప్రాణాలు పోయినా రాయల తెలంగాణ అంగీకరించబోమన్నారు.
రాయల తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్టుగా ఆయన ప్రకటించారు. బుధవారం నిరసనలతో
పాటు గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు కెసిఆర్. ఈ నెల 6 నుంచి జరిగే టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి తగిన కార్యాచరణ రూపొందిస్తామన్నారు.