టిడ్కో రగడ.. బాబు మినహా మిగతా అందరూ సస్పెండ్
posted on Dec 1, 2020 @ 5:29PM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. చంద్రబాబు మినహా టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.
టిడ్కో ఇళ్ళకు సంబంధించి ఈరోజు అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అసలు ఏం చెప్పాలనుకున్నారో చంద్రబాబుకు క్లారిటీ లేదని సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన కామెంట్స్ పై టీడీపీ సభ్యులు మండిపడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మినహా ఇతర టీడీపీ సభ్యులందరినీ స్పీకర్ సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలనే తీర్మానాన్ని మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రవేశపెట్టగా, స్పీకర్ ఆమోదించారు. దీంతో, ఈరోజు సభలో టీడీపీ తరపున చంద్రబాబు ఒక్కరే మిగిలిపోయారు.