Read more!

టిడిపి ఎమ్మెల్యేలు అరెస్ట్...

 

 

 

విద్యుత్ చార్జీలు తగ్గించాలని, నిరంతరం 7 గంటలు కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సచివాలయంలో ధర్నా చేపట్టారు. సీఎం కార్యాలయం సమతా బ్లాక్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి, ఎమ్మెల్యే క్వార్టర్స్‌వైపు తీసుకు వెళ్ళారు.


మొదట విద్యుత్ సౌధ వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. అక్కడ భారీగా పోలీసులు మోహరించడంతో టీడీపీ వ్యూహం మార్చింది. సచివాలయంలో సీఎస్ మధ్యూస్‌కు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించి అక్కడకు వెళ్ళగా సీఎం, సీఎస్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉండడంతో కలవలేకపోయారు. అనంతరం అక్కడే ఆందోళనకు దిగారు.