అజ్ఞాతం వీడిన పరిటాల, పోలీసుల ఎదుట ప్రత్యక్షం

 

 

 

 

అజ్ఞాతంలో ఉన్న పరిటాల శ్రీరామ్ గురువారం బయటికి వచ్చాడు. ధర్మవరం పోలీసుల ఎదుట హాజరై బెయిలు పత్రాలు అలాగే కోర్టు  రూ.25 వేల పూచికత్తును సమర్పించాడు. కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారన్న కేసులో పరిటాల శ్రీరామ్‌తో పాటు పదిహేను మందిపై ధర్మవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది.


అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిటాల శ్రీరామ్ అరెస్టు తప్పదని భావించిన శ్రీరాం కోర్టులో ముందస్తు బెయిలు పిటీషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం బుధవారం శ్రీరాంకు ముందస్తు బెయిలు ఇచ్చింది. శ్రీరాంతో పాటు ఈ కేసులో ఉన్న రాఘవేంద్రకు ముందస్తు బెయిలు వచ్చింది. వడ్డె నాగరాజు, రామకృష్ణ, శ్రీనివాసులులకు రెగ్యులర్ బెయిలు లభించింది. శ్రీరామ్ పోలీసు స్టేషన్‌కు వచ్చిన సమయంలో భారీగా పరిటాల అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు.