భువనేశ్వరి గారు చెప్పగానె దీక్ష విరమించా౦
posted on Mar 30, 2013 @ 11:36AM
విద్యుత్ సమస్యలపై నిరవధిక దీక్ష చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్స్ లో దీక్షలను విరమించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి నిమ్స్ ఆస్పత్రికి చేరుకుని ఎమ్మెల్యేలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనారోగ్యం క్షీణించిన ఎమ్మెల్యేలకు నిమ్స్ వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు నిమ్స్ నుంచి ఈఆర్సీకి వెళ్లనున్నారు.
నిమ్స్ ఆస్పత్రి వద్ద టీడీపీ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ దీక్షల భగ్నంతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దీక్ష విరమించాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి కోరారని చెప్పారు. దీంతో నేతలు దీక్షల ను విరమించారని తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.