టిడిపి నేతల దీక్ష భగ్నం ఫోటోస్
posted on Mar 30, 2013 @ 9:46AM
విద్యుత్ సమస్యల మీద ఆందోళన చేస్తున్న టీడీపీ నేతల నిరాహార దీక్షను శుక్రవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. గత నాలుగు రోజులుగా హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న 26 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వారిని జాయింట్ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో బలవంతంగా అరెస్టు చేశారు. దీక్షను విరమింపచేసేందుకు ప్రయత్నిస్తే ఆత్మహత్యలకు పాల్పడతామని టీడీపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. అర్ధరాత్రి వేళ అరెస్టు చేయడం అన్యాయమని టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అరెస్టు చేసిన ఎమ్మెల్యేలను చికిత్స నిమిత్తం స్పీకర్ ఆదేశాల మేరకు పోలీసులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు చికిత్సకు నిరాకరిస్తున్నారు.