ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసిన తెలుగుదేశం
posted on Sep 15, 2022 @ 10:37AM
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదటిరోజు గురువారం(సెప్టెంబర్15) విపక్షాల నినాదాలతో హోరెత్తింది. తొలి రోజే టీడీపీ సభ్యులు ఆందోళనలు చేపట్టారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డకుకుంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య గవర్నర్ ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో మార్షల్స్ రంగ ప్రవేశం చేసి బీటెక్ రవితో పాటు మరో ఎమ్మెల్సీని బయటకు తీసు కెళ్లారు. దీంతో మార్షల్స్ తో తెలుగుదేశం సభ్యులు వాగ్వాదానికి దిగారు. చివరకు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
అంతకుముందు గవర్నర్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సీఎం జగన్ తీవ్ర అస హనం వ్యక్తం చేశారు. జాబ్‌క్యాలెండర్... జాబ్‌లెస్ క్యాలెండర్ అంటూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మా నాన్ని స్పీకర్ తిరస్కరించడంతో గొడవ మొదలైంది. వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం దగ్గర దూసుకెళ్లి టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. జాబ్ ఎక్కడ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిరుద్యోగులను మోసం చేసిన జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారిందని టీడీపీ నినాదాలు చేసింది. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాన్ని చేపడతామని స్పీకర్ చెప్పినప్పటికీ తెలుగుదేశం సభ్యులు వెనక్కి తగ్గలేదు. అసెంబ్లీ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు.
.టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల్లో టీడీపీ సభ్యుల ప్రశ్నలే ఉన్నాయన్నారు. ప్లకార్డులతో సభలోకి రావడం సరికాదని అన్నారు. టీడీపీ సభ్యులు కావాలనే ఆందోళన చేస్తున్నారని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.