టి.కాంగ్రెస్‌లో తెలంగాణా తల్లి రభస
posted on Sep 16, 2022 @ 1:39PM
రాజకీయాల్లో విగ్రహాల రాజకీయం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. మరణించిన నాయకుల విగ్రహాల ప్రతిష్ట రభస చాలాకాలం నుంచి అన్ని పార్టీల్లోనూ ఉంటూనే ఉంది. ఒకరి అభిప్రాయం, మరొకటి నచ్చక చిలికి చిలికి విధేదాలు పార్టీల్లో చీలికలకు దారితీస్తున్నాయి. ఆనక బుజ్జగింపుల కార్యక్రమంతో శాంతి స్తున్నారు. ఇపుడు తెలంగాణా కాంగ్రెస్లో కొత్త రభస మొదలయింది. అసలే రేవంత్ రెడ్డి ఆధిపత్యాన్ని అంతగా ఇష్టపడని సీనియర్ నాయకులు ఇపుడు తెలంగాణా తల్లి విగ్రహం విషయంలో వివాదం రేపారు.
నేలతంతా రెండుగా చీలిపోయారు. కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను తిరస్క రిస్తూ ఒక వర్గం, మద్దతుగా మరో వర్గం తయారైంది. కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీనియర్లు అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారు. రేపు కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించడానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ సిద్ధపడుతు న్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దని రేవంత్‌పై సీనియర్లు ఒత్తిడి తెస్తున్నారు.
నిన్న సీనియర్ల సమావేశంలో గాంధీ భవన్‌లో సెప్టెంబర్ 17 వేడుకలపై చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రేపు గాంధీ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై టీపీసీసీ చీఫ్ తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణా తల్లి కొత్త విగ్రహం రెడీ అయ్యింది. ఈ నెల 13న జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సెప్టెంబర్ 17 వేడుకలపై తీర్మానం చేశారు. అయితే సీనియర్లు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రేవంత్ వారందరినీ వ్యతిరేకించి నిర్ణయం తీసుకుంటారా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారా? లేదంటే విరమించుకుంటారా? చూడాల్సి ఉంది.