అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్లు..
posted on Mar 31, 2016 @ 3:47PM
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల బరిలో దిగడానికి అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ పార్టీల్లోకి సినీ పరిశ్రమకు చెందిన వారిని తీసుకునేవారు. కానీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి ట్రాన్స్ జెండర్లకి కూడా అవకాశం ఇస్తున్నాయి తమిళపార్టీలు. ఇప్పటికే దేవి అనే ట్రాన్స్ జెండర్ కి చెన్నైలోని ఆర్‌కె నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందకు టికెట్ లభించింది. దేవి ప్రస్తుతం ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తుంది. ఇప్పుడు ఏఐఏడీఎంకె పార్టీ కూడా పి.సుధ అనే ట్రాన్స్‌జెండర్‌కు పార్టీ టికెట్ ఇచ్చినట్లు సమాచారం. సుధ ట్రాన్స్‌జెండర్‌ల సంక్షేమం కోసం పలు సామాజిక సంఘాల ద్వారా కృషి చేస్తున్నారు. మరి అందరిలాగే వీరికి కూడా ఓట్లు వేసి ప్రజలు గెలిపిస్తారో లేదో చూడాలి.