తమిళ శాసనసభలో మొదటిసారి రోశయ్య ప్రసంగం
posted on Jan 30, 2012 @ 3:25PM
హైదరాబాద్: తమిళనాడు పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర గవర్నర్‌గా ఆయన తమిళనాడు శాసనసభలో తొలిసారి సోమవారం ప్రసంగం చేశారు.ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి ఆయన వివరించారు. తమిళనాడు గవర్నర్‌గా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత శాసనసభను ఉద్దేశించి ఆయన ప్రసంగించడం ఇదే మొదటిసారి. ముల్లపెరియార్ డ్యామ్ వివాదంలో తాము రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తూ కేరళ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు.ప్రభుత్వం సాగిస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కేరళ ప్రజలను కోరారు.సంకుచిత దృష్టితో కూడిన రాజకీయ ప్రయోజనాలను ఆశించి ముల్లపెరియార్ డ్యామ్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోనట్లు వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాలతో సామర్యవూర్వకంగా వ్యవహరించాలని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముల్లపెరియార్ డ్యామ్‌కు సంబంధించిన సంఘటనల విషయంలో తాము సహనంతో వ్యవహరించామని ఆయన చెప్పారు.