టీ20 ప్రపంచకప్..రోహిత్, కోహ్లీలకు పెద్ద పరీక్ష!
posted on Oct 19, 2022 @ 4:27PM
టీ20 ప్రపంచకప్ ఈసారి ఆస్ట్రేలియాలో ఆరంభమయింది. ఈ 8వ ఎడిషన్ ఎవరు విజేత అవుతారు, కప్ కొడతారన్న చర్చ ఆరంభమయినపుడు భారత్‌కే చాలా అవ కాశాలున్నాయనే అందరూ అన్నారు. 2007 లో ధోనీ నాయకత్వంలో టీమ్ ఇండియా కప్ గెలిచింది. మరి ఈ ఏడాది అంతే స్థాయిలో విజయం సాధించేందుకు శర్మ నాయకత్వ పటిమ ప్రదర్శించాలి. ఎందు కం టే మన దాయాదులు పాకిస్తాన్ చెప్పుకోదగ్గ స్థాయిలో టోర్నీలో నిలిచే అవకాశాలు లేవన్న ప్రచారం ఇప్ప టికే ఉంది.
ఈమధ్య ఆసీస్ తో తలపడిన సీరీస్‌ను 2-1 తేడాతో గెలిచి క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ 20 మ్యాచ్‌లు గెలిచిన దాయాదుల రికార్డును అధిగమించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో విజయంతో టీ 20 లో 21 విజయాలు సాధించినట్లయింది. పాకిస్తాన్ 2021లో 21 మ్యాచ్‌లు గెలిచింది. కాగా 2022లో ఇంతవరకూ భారత్ పది వివిధ జట్లతో 32 టీ20లు ఆడింది. వాటిలో 23 గెలవగా 8 ఓడిపోయింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో తలపడిన సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. తర్వాత లంకతో తలపడిన సిరీస్ కూడా అలానే సాధించింది సత్తా చాటి, ఆ విజయపరంపర అలా కొనసాగి స్తోంది. కానీ ఆసియాకప్‌లో మాత్రం జట్టులో కొన్ని లోపాలు బయటపడ్డాయి. పాకిస్తాన్‌తో తలపడిన తొలి మ్యాచ్ లో గొప్పగా ఆడకపోయినా గెలిచింది. కానీ సూపర్ ఫోర్ స్థాయిలో పాక్ చేతిలోనే ఓడిపోయింది. దీంతో ఫైనల్ అవకాశాలూ దెబ్బతిన్నాయి. శ్రీలంక కూడా భారత్‌ను ఓడించింది. చిత్రమేమంటే పాకిస్తాన్‌ని కూడా చిత్తు చేసి శ్రీలంక విజేతగా ఇంటికి వెళ్లడం! దీని తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లతో తలపడిన సిరీస్‌లను 2-1 తేడాతో గెలిచి జట్టు బలం వీగిపోలేదని నిరూపించింది.
అయితే భారత్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా ప్రపంచకప్ కి దూరం కావడం జట్టును దెబ్బతీస్తుంది. అతని స్థానాన్ని భర్తీ చేయడానికి మరో మంచి పేసర్ వచ్చినప్పటికీ అతని లోటు మాత్రం కనపడుతుంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మకి అతనంటే బాగా నమ్మకం కూడా. అంతే గాకుండా, చివరి ఓవర్లలో ధాటిగా ప్రత్యర్ధిని ఇబ్బందిపెట్టగలిగే బౌలర్ అతనికి కరవయ్యాడు. మరీ ముఖ్యంగా ఫీల్డింగ్‌లో చిరుత లాంటి ఆల్‌రౌండర్ రవీంద్రజడేజా లోటు మాత్రం ప్రపంచకప్‌లో స్పష్టమ వుతుంది. ప్రత్యర్ధి జట్లకు కూడా అతని సత్తా తెలుసు. 2007 తర్వాత ప్రపంచకప్‌ను అందుకోని భారత్ గత టోర్నీలో సెమీస్ కూడా చేరుకోలేకపోయింది.
ఈ పర్యాయం భారత్ ఉన్న గ్రూప్‌లో పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఉన్నాయి. అందువల్ల ఆరంభం నుంచే గట్టి పోటీని టీమ్ ఇండియా ఎదుర్కొ నుంది. మరి కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ పటిమ ఇపుడు తెలుస్తుంది. పాకిస్తాన్ ఎలాగయినా భారత్‌ను టీ 20ల జోరును అడ్డుకో వాలన్న పట్టుదలతోనే ఉంది. జట్టులో కింగ్ కోహ్లీ , రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ మళ్లీ తమ పాత గొప్ప ఫామ్‌లోకి తిరిగి రావడం కూడా పాక్, దక్షిణాఫ్రికాలను కంగారుపెడుతోంది.