నటి శ్వేతా మీనన్ ఫిర్యాదు వెనక్కి

 

 

 

మలయాళ నటి శ్వేతా మీనన్ పట్ల కేరళ ఎంపీ పీతాంబర కురువ్ అసభ్యంగా ప్రవర్తించినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని నటి శ్వేతా మీనన్ కూడా ధ్రువీకరించారు. కేరళలోని కొల్లాంలో జరిగిన పడవల పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవంలో తాను పాల్గొన్నానని, అక్కడ ఒక రాజకీయవేత్త తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె చెప్పారు.

 

శ్వేతామీనన్ పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోలేదని, తాను ముఖ్యమంత్రి ఉమెన్ చాందిని కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆ తరువాత ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమె నుండి వాంగ్మూలం తీసుకున్నారు. 71 ఏళ్ల పీతాంబరంపై ఐపిసి సెక్షన్‌లు 354, 354(ఎ) కింద పోలీసులు కేసు రిజిష్టర్‌ చేశారు.



రాజకీయవేత్త అయిన పీతాంబరంపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి వున్నానని ఆమె అంతకుముందు స్పష్టం చేశారు. అయితే అనూహ్యంగా కొద్ది గంటల వ్యవధిలోనే ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. అయితే పీతాంబరం క్షమాపణలు చెప్పారని, కుటుంబ సభ్యులతో మాట్లాడారని అందుకే ఫిర్యాదు వెనక్కి తీసుకున్నట్లు శ్వేతామీనన్ అన్నారు. ఈ విషయపై పీతాంబర గుస్సా అవుతున్నారట. శ్వేతామీనన్‌పై న్యాయపరమైన చర్యలకు ఆయన సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.