Read more!

మమతా బెనర్జీ నామినేషన్ పై బీజేపీ అభ్యంతరం... తృణమూల్ లో టెన్షన్

పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో అనుక్షణం ఉత్కంఠ పెరుగుతూ పోతోంది. ముందుగా  సీఎం మమతా బెనర్జీ కొంత మంది దుండగుల దాడిలో గాయపడ్డారని ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత ఆమె ప్రచారంలో జరిగిన యాక్సిడెంట్ గా అధికారులు తేల్చారు. తాజాగా దీదీ పై పోటీ చేస్తున్న బీజేపీ నేత సువేందు అధికారి ఆమెపై కొత్త అభియోగం మోపారు. మమతా దాఖలు చేసిన నామినేషన్ తోపాటు ఇచ్చిన అఫిడవిట్ లో తనపై ఉన్న పోలీసు కేసుల వివరాలు తెలపకుండా దాచిపెట్టారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. సీఎం మమతా బెనర్జీపై  ఆరు క్రిమినల్ కేసులతోపాటు ఒక సిబిఐ కేసు కూడా ఉందని, మరోపక్క అసోం లో ఆమెపై మరో ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆ ఫిర్యాదులో తెలిపారు.

 

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ నామినేషన్ ను తిరస్కరించాలని యిసిని కోరినట్లుగా వెల్లడించారు.  దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్లుగా అయన చెప్పారు. ఎన్నికల నిబంధనలు ముందు సీఎం అయినా మరొకరైనా ఒకటేనని.. ఒక బాధ్యతగా దీనిపై అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసానని అయన అన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలియచేసారు.  దీంతో తృణమూల్ పార్టీ కేడర్ లో టెన్షన్ నెలకొంది.