సుష్మ గారు నిజంగా మీరేనా..
posted on Aug 24, 2016 @ 5:24PM
భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్‌కు అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన ట్వీట్లు వస్తుంటాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆమె అలాంటి ట్వీట్లకు కూడా చాలా మర్యాదపూర్వకంగా సమాధానాలు ఇస్తుంటారు. గతంలో గతంలో కారు దెబ్బతింది, రిఫ్రిజిరేటర్ చెడిపోయిందంటూ పలు ఫన్నీ ట్వీట్లు వచ్చాయి. వాటికి ఆమె సమాధానం చెప్పారు. ఇప్పుడు కూడా సుష్మకు అలాంటి ట్వీటే ఒకటి వచ్చిది. సుమంత్ బల్గి అనే వ్యక్తి ‘సుష్మాస్వరాజ్ నిజంగా మీరేనా? కేవలం చెక్ చేసుకుంటున్నాను.. భారతలో రాజకీయ నాయకుల లక్షణాలు మీకులేవు.. మీరు మా(భారతీయుల) గురించి ఆలోచిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే దీనికి స్పందించిన సుష్మ.. దయచేసి అలాంటి భావాలతో ఉండొద్దు. భారత రాజకీయ నాయకులు చాలా సున్నితమైనవారు.. సహాయతత్వం గల వారు అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో సుష్మ చేసిన మర్యాదపూర్వకమైన ట్వీట్ పై అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు.