Read more!

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు.. మోడీ ఇంటిపేరు వ్యాఖ్యలపై సూరత్ కోర్టు తీర్పు

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, కీలక నాయకుడు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గుజరాత్‌లోని సూరత్ కోర్టు తీర్పు వెలువరించింది.  దోంగలందరి ఇంటి పేరు మోడీ యే  ఎలా అవుతోందంటూ రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును విచారించిన కోర్టు ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.  

నిరవ్ మోడీ, లలిత్ మోడీలతో పాటు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ 2019లో , మోదీ ఇంటిపేరు ఉన్న వారంతా దొంగలేనని అర్ధం వచ్చేలా విమర్శించిన సంగతి విదితమే. దీంతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేశ్ మోడీ రాహుల్ గాందీపై కేసు పెట్టారు.     దీనిపై సూరత్ కోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ గతంలో పలు మార్లు హాజరయ్యారు కూడా.  కాగా మోడీ ఇంటిపేరు ఉన్న వారందర్నీ రాహుల్ గాంధీ కించపర్చలేదని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది.

మోడీ  ఇంటి పేర్లు ఉండి పరారీలో ఉన్న నిరవ్ మోదీ, లలిత్ మోదీల గురించే ప్రస్తావించారని, ఇది మోడీపై రాజకీయ విమర్శకిందకే వస్తుందని పేర్కొంది. అయితే అయితే కోర్టు మాత్రం రాహుల్ వ్యాఖ్యలు డిఫమేషన్ కిందకే వస్తాయని పేర్కొంటూ  రెండేళ్ల జైలు శిక్ష విధించింది.