తలాక్ విధానాన్ని నిషేధించవచ్చు..
posted on Mar 31, 2016 @ 4:49PM
తలాక్ అనే పదాన్ని మూడుసార్లు చెబితే చాలు తమ భార్యలకు విడాకులు ఇచ్చినట్టే. ఇది ముస్లిం ఆచార వ్యవహారాలలో అనతి కాలంగా వస్తున్న సంప్రదాయం. అయితే ఉత్తరాఖండ్‌కు చెందిన సైరాబాను అనే ముస్లిం మహిళ ఆ విధానంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. గత కొద్దిరోజులుగా ఈ వ్యవహారం చర్చాంశనీయమైంది. అయితే ఈ పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు.. ముస్లిం మత విధానాలు అన్నితెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కమిటీని ఏర్పాటుచేయమని.. దానికి సంబంధించిన నినేదికను అందించమని ఆదేశించింది. దీంతో 'ఇటువంటి విడాకుల పద్ధతి ద్వారా మహిళలు తమ వివాహ జీవితంపట్ల అభద్రతాభావానికి గురవుతున్నార'ని పేర్కొంటూ తలాక్ విధానాన్ని నిషేధించాలనే డిమాండ్ సరైనదేనని కమిటీ స్పష్టం చేసింది. అంతేకాదు మూడుసార్లు తలాక్ అనే విధానాన్ని, బహుభార్యత్వాన్ని నిషేధించాలని కమిటీ సూచించింది. 1939నాటి ముస్లిం మ్యారేజెస్ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని కమిటీ సూచించింది. మరి కమిటీ చెప్పిన సూచనలు కేంద్రం తీసుకుంటుందా.. లేక మతపరమైన వివాదాలు ఎందుకులే అని సైలెంట్ గా ఉంటుందా.. చూడాలి.