సోనియాగాంధీ లక్షలాది కోట్లు మింగేశారా!
posted on May 13, 2013 @ 12:04PM
జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి హెచ్చరిక జారీ చేశారు! సోనియాను వదిలే ప్రసక్తి లేదని, ఆమె పని పడతానన్నారు. ఆమె లక్షలాది కోట్ల రూపాయాలను దేశం దాటించారని ఆరోపించారు. ఆ వివరాలను తాను త్వరలోనే బయటపెడతానని అన్నారు. యూపీఏ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఎన్డీయే కూటమి అధికారం సాధించగలదన్నారు. ప్రధాని మూగబోయిన మొబైల్ ఫోన్ లా వ్యవహరిస్తున్నారు. తృతియ ఫ్రంట్ ఏర్పాటును తాను స్వాగతిస్తున్నానని స్వామి అన్నారు. దాని వల్ల కాంగ్రెస్ కు తీరని నష్టం జరుగుతుందన్నారు. ఏపీ పర్యటనకు వచ్చిన స్వామి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ…ఇక్కడ కాంగ్రెస్ పతనమేనని స్పష్టం చేశారు. 2014లో కాంగ్రెస్ స్థానాన్ని ఇతర పార్టీలు ఆక్రమిస్తాయన్నారు. జగన్ యూపీఏకు మద్దతునిచ్చే అవకాశం లేదని సుబ్రమణ్య స్వామి అభిప్రాయపడ్డారు. అలాగే. వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో ఎన్డీయేకు వచ్చే ముప్పేమీ లేదని చెప్పారు.