కె.ఎల్.రాహుల్ అవసరమా.. స్టిరిస్ ప్రశ్న
posted on Aug 5, 2022 @ 2:55PM
భారత్ క్రికెట్ జట్టులోకి రావడానికి ఇపుడు కుర్రాళ్లు చాలామందే ఎదురుచూస్తున్నారు. గతంలో వలె ఒక్క రిద్దరే ఏళ్ల తరబడీ జట్టు బరువు బాధ్యతలతో ఇబ్బంది పడటం ఇపుడు లేదు. ఈ రోజుల్లో భారత్ క్రికెట్ క్యాంపులు ఎంతో చురుకయిన ప్లేయర్లను తయారుచేస్తోంది. బౌలర్, బ్యాటర్లను జాతీయ జట్టుకు ఎప్పు డయినా అవసరమై పిలిస్తే ఆడేంతగా తయారుచేయడంలో అకాడెమీలు కీలకపాత్ర పోషిస్తు న్నా యి. చాలాకాలం ఓపెనర్‌గా కె.ఎల్.రాహుల్ అన్నిస్థాయిల్లోనూ నిలకడగా ఆడుతూ అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు.
ఇటీవల అనారోగ్యం కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానాన్ని భర్తీ చేయడానికి సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్‌లు మంచి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అంతే గాక, తమ వంతు అద్బుత బ్యాటింగ్‌తో రాణిస్తున్నారు. ఇక ఇపుడు భారత్ జట్టులోకి రాహుల్ ప్రత్యేకించి రావాల్సిన అవసరం ఏముంటుంది అని న్యూజిలాండ్ ఆల్ రౌండర్ స్కాట్ స్టిరిస్ పెద్ద ప్రశ్నే సంధిం చాడు. వెస్టిండీస్‌తో టీ-20కి జట్టులోకి రాహుల్‌ని ఎంపిక చేశారు. కానీ అతనికి కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో అతను అవకాశం కోల్పోయాడు.
వాస్తవానికి ఏ ప్లేయరూ జాతీయజట్టు నుంచి బయటపడాలని అనుకోరు. ఇతరులకు ఆ అవకాశం ఇవ్వా లని అనుకోరు. ఒకసారి తప్పుకుంటే ఆ వచ్చే ప్లేయర్ తప్పకుండా తన స్థానాన్ని భర్తీచేసి విజృం భిస్తే తన స్థానం ప్రశ్నార్ధకమే అవుతుందన్న భయం అందరిలోనూ ఉంటుంది. ఇప్పుడు రాహుల్ విషయం లో న్యూజిలాండ్ సీనియర్ సంధించిన ప్రశ్న ఇదే. ఒకవేళ అతను మళ్లీ తిరిగి వచ్చినా రిషబ్, సూర్య కుమార్ వలె విజృంభించి మంచి స్కోర్ చేసి జట్టుకు తన అవసరాన్ని తెలియజేయగలడా అన్నదే అనుమానం. ఈ రోజుల్లో దేశంలో అనేకానేక టోర్నీలు జరుగుతున్నాయి, ఎందరో కుర్రాళ్లు ఏకంగా చిన్నస్థాయిలోనే రికార్డులు నెలకొల్పుతున్నారు. అందువల్ల భారత్ క్రికెట్‌కు భవిష్యత్ ఢోకా లేదనేది అందరూ అంగీకరించే అంశం. ఇదిలా ఉండగా, రాహుల్ మాత్రం తనకు ఆరోగ్యం బాగానే ఉందని, జూన్‌లో జరిగిన సర్జరీ విజయవంతమయిందని, మళ్లీ శిక్షణకు సిద్ధమయ్యానని ఫిట్నెస్‌తో తిరిగి జట్టులోకి రాగలనన్న నమ్మకాన్ని ప్రకటించాడు.
ఆగష్టు 18వ తేదీ నుంచి జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఉంది. అప్పటికి తప్పకుండా టీమ్ ఇండి యాలోకి వచ్చేస్తానని ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నానని కె.ఎల్. రాహుల్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం భారత్ జట్టుకు సీనియర్ ప్లేయర్ శిఖర్ ధవన్ సారధ్యం వహిస్తున్నాడు. దీపక్ చాహర్ కూడా గాయాల నుంచి బయటపడి జట్టులోకి ఎంపికయ్యాడు.