Read more!

కొవ్వు చెప్పే కథ వింటే ఆశ్చర్యపోతారు!

నీకు కొవ్వు బాగా పట్టిందిరా.. అంటుంటారు చాలా మంది ఎవరైనా నిర్లక్ష్యంగా, పొగరుగా ప్రవర్తిస్తున్నపుడు. అయితే కొవ్వు అనేది శరీరానికి ఎంత అవసరమో అది హద్దు మించి పెరిగితే ఆరోగ్యానికి అంత చేటు చేస్తుంది. మనిషి ప్రవర్తన కూడా పరిధి మించితే అలాంటి నష్టాన్ని కలిగిస్తుందని దాని ఉద్దేశం. ఇకపోతే మన రక్తంలో కొవ్వు కలిగివుండడం ప్రమాదకరమని అందరికీ స్పష్టంగా తెలుసు. కీళ్ళ నొప్పులు, రక్తపోటు, డయబెటీస్ పరోక్షంగా కారణమని కూడా తెలుసు. అయితే కొవ్వును అయిదు రకాలుగా చెబుతారు. ఈ కొవ్వులకు విరుగుడు, చికిత్స తగ్గించడానికి ఏం చేయాలో మాత్రం వైద్యశాస్త్రంలో సమాధానం దొరకలేదు.


మొదటి రకం కొవ్వు: కిలో మైక్రాన్స్ అనే కొవ్వు చర్మంలో నిలవవుంటుంది. దీనిని క్యాంధమన్ అంటారు. గుండెపోటు ఇతర బాధలుండవు, కాని శరీరభాగాలు ఉబ్బెత్తుగా అక్కడక్కడ కనిపిస్తుంది. కండకాదు కొవ్వు అని తెలిసినా మనం చేయగలిగిందేమీలేదు. వ్యాయామం శ్రమ తప్ప.


రెండవ రకం కొవ్వు: రెండవ రకం కొవ్వును లిప్రొటిన్స్ అని పిలుస్తారు. ప్రోటీనులలో కొలెస్ట్రాతో కలిసిన కొవ్వు తక్కువ బరువు (తేలికగా) వుంటుంది. గుండెపోట్లకు కారణం ఇదే. 


మూడవ రకం కొవ్వు: ట్రిగ్లి సిరిడిన్ అంటారు. బరువు ఎక్కువ కలిగిన లిపోప్రొటీన్సు కొలెస్ట్రాల్లో గుండెపోటులకు కారణం. 


నాలుగవ రకం కొవ్వు : తేలికగా వుంటుంది. డయాబెటీస్ వల్ల ఎక్కువ బరువు ఉన్నవారిలో ఇది ఉంటుంది.


 అయిదవ రకం కొవ్వు: కిలో మెక్రాన్స్ చిన్న చిన్న లిపోప్రోటిన్స్ కలిసినది. తాగుడు అలవాటుపడ్డ వాళ్ళలో ఇది వుంటుంది. 1,4,5 కొవ్వులు ఆహార నియమం వలన తగ్గించే అవకాశాలు ఉన్నాయి. 2, 3 కొవ్వుల విషయంలో కొలెస్ట్రాల్ తక్కువ ట్రిగ్లిసిరైడ్స్ తక్కువ వుండేలా జాగ్రత్తపడాలి.


ఈ కొవ్వులను తగ్గించుకోవడం సమస్య అయితే దీనివలన వచ్చే జబ్బులు సమస్యలు మరింత బాధాకరంగా వుంటుంది. అసలు ఈ కొవ్వు ఎలా నిలవ అయిందనేది సమస్య. కారణాలు చాలా ఉంటాయి. ఆహారంలో కొవ్వు తగ్గించుకోవాలి అని చెప్పడం, కొలెస్ట్రాల్ తగ్గించడం వలన కొవ్వు బెడద తగ్గించుకోవచ్చునని అనుకోవడం తేలిక. అయితే అది ఎంతవరకు వాస్తవము, ఆచరణ యోగ్యం అనేది ఆలోచించాలి.


మూడు వందలమందికి కొవ్వు తగ్గించి కొవ్వు లేకుండా ఆహారమిచ్చి మూడు సంవత్సరాలపాటు పరీక్షలో వుంచారు. రెండు వర్గాలలో జబ్బు తీవ్రత మరణాలు కూడా సంభవించాయి. అయితే ఒక విషయం స్పష్టంగా తేలిపోయింది. కొవ్వును అదుపులో పెడితే జబ్బును అదుపులో పెట్టవచ్చు. కొవ్వు తగ్గించుకుంటే గుండెపోటు ఇతర బాధలుండవు. డాక్టర్ కోహెన్ పరిశోధనలో యెమెన్ లో వున్న జ్యూలు చాలా లావుగా వుంటారు. ఎక్కువ కొవ్వు కలిగిన పదార్ధాలు, ఆహారం తింటారు. ఎంత కొవ్వు పదార్థాలు తిన్నా,  ఎంత లావున్నా ఏ జబ్బూ రాలేదు. బలంగా కూడా వున్నారు. అంతే కాదు మరొక విషయం కూడా తేలింది. ఆధునిక ఆహారం బిస్కట్లు, కేకులు, పుడింగులు, బ్రాంది నాగరిక ఆహారం తిని లావెక్కిన వారిలోనే ఈ జబ్బు కనిపిస్తున్నాయి. కానీ పూర్వం తినే ఆహారం తిని లావెక్కిన వాళ్ళలో ఏ జబ్బులూ లేవు. అంచేత మనపూర్వులు ఆదేశించిన ఆహారం సక్రమమైనది బలవర్ధకమైనది అని స్పష్టమవుతుంది.


                                  ◆నిశ్శబ్ద.