విమర్శలు ఇక చాలించండి
posted on Jun 22, 2023 @ 10:24AM
ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా..జనసేన అధినేత పవన్ కల్యాణ్ ..వారాహిపై యాత్ర మొదలెట్టారు. ఎన్నికలకు ముందు తమ పార్టీకి ఊపు తీసుకొచ్చే ప్రయత్నంలో శ్రమిస్తున్నారు. యువత అభిమానాన్ని బలంగా కలిగిన జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ యువతను తమ వైపు ఆకర్షించేందుగా ఈ యాత్రను ప్లాన్ చేసిన జనసేనా ని తమకు అనుకూల ఓటు బ్యాంక్ అయినా గోదావరి జిల్లాలను ఉత్తరాంధ్ర జిల్లాలను లక్ష్యంగా చేసుకొని యాత్ర చేస్తున్నారు.అయితే తన యాత్రలో ఆయన ఇస్తున్న స్పీచ్ ల పట్ల యువత బాగానే ఆసక్తి చూపుతున్నప్పటికీ, స్థానిక నాయకులు పై అధికార పార్టీ నాయకుల పై ఆయన చేస్తున్న విమర్శలు తట్టస్థ ఓటర్లలో మాత్రం కొంత విమర్శలపాలవుతుంది. అధికార పక్షానికి వార్నింగ్ ఇస్తూ ఆయన ఉపయోగిస్తున్నకొన్ని పదాలు యువతను ఉర్రూతలుగిస్తున్నాయి. అయితే.. ఎంతసేపు అధికార పార్టీ నేతలపై విమర్శలు తప్ప జనసేన అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ది..తీసుకు రాబోయే విధానాలను తేటతెల్లం చేయడంలో విఫలమవుతున్నారనే భావన అందరిలో కలుగుతుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల జనసేన తీసుకున్న విధానాలేమిటి... ?ఆ సమస్యలను తీర్చడానికి జనసేన పాటించబోయే లేదా తీసుకురాకపోయే చట్టాలు ఏమిటి..? జనసేన సంక్షేమ పథకాలు ఏమిటి ? అన్న విషయాలపై ఎక్కువ సమయం కేటాయిస్తే అది తటస్థ ఓటర్లను ఆకట్టుకుంటుందని.. అపుడు జనసేన ఓటు బ్యాంకు పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.పూర్తి సమయాన్ని ప్రత్యర్థులను విమర్శించడానికి పెడుతున్న జనసేన తటస్థ ఓటర్లు ను దూరం చేసుకుంటున్నారన్న విమర్శలను దృష్టిలో పెట్టుకొని యాత్ర తర్వాతి రోజులలో అయినా జనసేన తీసుకురాబోయే నూతన విధానాలను అందించబోయే సుపరిపాలన ప్రజలకు వివరిస్తే పార్టీకి మంచిదని వారు అంటున్నారు.
రాష్ట్రంలో 70 శాతం ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. సంక్షేమ పథకాల పేరుతో సీఎం జగన్ 100 మంది కష్టాన్ని 30, 40 మందికి పంచుతున్నారని అన్నారు. తమ వాడని నమ్మి వైయస్ జగన్ కి ఓటు వేసిన రైతులకు జగన్ మొండి చేయి చూపిస్తున్నారు. ఇటీవల అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం కేవలం డబ్బులు చెల్లించింది.అకాల వర్షాల కారణంగా కొద్ది రోజుల క్రితం పంట నష్టపోయిన రైతులను పలకరించడానికి జనసేన అధినేత పవన్ వస్తున్నానని తెలిసి ప్రభుత్వం హుటాహుటిన రైతుల ఎకౌంటు లోకి డబ్బులు వేసింది. చట్టసభలలో బలం లేకపోయినా గాని ప్రజల తరఫున పోరాడుతున్నాం.రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీకి అండగా ఉంటే.రైతులకు అనీ వర్గాల ప్రజలకు చూసుకుంటానని పవన్ ఆశలు కలిగిస్తున్నారు.వైసీపీ నాయకుల్ని.. గూండాలు.. రౌడీలు..అని పవన్ తిడ్తున్నారు. బట్టలు ఊడదీసి.. వీధుల వెంట పరిగెత్తించి మరీ కొడ్తానని ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విమర్శలు కాసేపు ఆపి.. జనసేన అధికారంలో వస్తే ఏపీ ప్రజలకు చేస్తారనేది చెప్తే బాగుంటుందని రాజకీయ పండితులు..ప్రజలు కోరుతున్నారు.