వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు బయలుదేరిన సీఫెన్ సన్
posted on Jun 17, 2015 @ 3:35PM
నోటుకు ఓటు కేసులో ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తయితే ఇప్పుడు అత్యంత కీలకమైన తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలంతో జరగబోయే పరిణామాలు ఒక ఎత్తు. ఈ కేసులో కీలక సాక్షి స్టీఫెన్ సన్ తన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ముందు తెలియజేయడానికి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు బయలుదేరారు. ఏసీబీ అధికారులు ఈ కేసు గురించి దర్యాప్తు చేసి ఎంతో సమాచారాన్ని సేకరించిన స్టీఫెన్ సన్ ఇచ్చే వాంగ్మూలం మాత్రం అత్యంత కీలకమైంది. స్టీఫెన్ సస్ ఇచ్చే వాంగ్మూలం బట్టే ఎవరెవరికి నోటీసులు జారీ చేయాలో ఏసీబీ అధికారులు ఒక నిర్ణయానికి వస్తారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం స్టీఫెన్ సన్ కు పూర్తిస్థాయి భద్రత కల్పించింది. 20 మంది వరుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పటిష్టమైన భద్రత మధ్య.. బులెట్ ఫ్రూఫ్ కారులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు వెళ్లారు స్టీఫెన్ సన్. ఈయన ఇచ్చే వాంగ్మూలం బట్టే ఈ కేసులో ఉన్నది ఎవరు.. తనతో ఎవరు బేరసారాలు జరిపారు అనే విషయం తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అందరిలోనూ చాలా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నాంపల్లి కోర్టు బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.