రాష్ట్రంలో శ్రీలంక పరిస్థితులు.. చంద్రబాబు
posted on Jul 21, 2022 @ 10:20AM
ఇంటి గుట్టు వీధికెక్క కూడదంటారు. వైసీపీ ప్రభుత్వం ఇంటి గుట్టునే ముందుగా బయటపెట్టుకుంది. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితుల గురించి ప్రతీ ఒక్కరూ చర్చించుకునే స్థితికి తీసుకు వచ్చింది. బీజేపీ నాయకులు ఎవరు రాష్ట్రానికి వచ్చినా ముందుగా వెటకారం జోడించి ప్రశంసించేది ఇలానే. రాష్ట్రం దాదాపు శ్రీలంక పరిస్థితుల్లో ఉందనే. ఇక్కడి నాయకులు సరే సరి. వారంతా రాజకీయపరంగా ఎద్దేవా చేసినవారు. అయితే ఇప్పుడు నిజంగానే సీరియస్‌గా తీసుకోవాల్సింది టీడీపీ అధినేత నారా చంద్రబాబు వ్యాఖ్య. ఆయన స్వయంగా ఆర్ధిక వేత్త ఆర్ధిక పరిస్థితుల మీద సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి మరి ఆయనే మన రాష్ట్రం లో శ్రీలంకలో ఉన్న దుర్భర పరిస్థితులు ఇప్పటికే ఉన్నాయన్నారంటే నమ్మి తీరాలి.
ఉద్యోగులకు ఎప్పటి నుంచో సకాలంలో జీతాలు చెల్లించడం లేదని టీడీపీ అధినేత అన్నారు. జీపీఎఫ్ కూడా విత్‌డ్రా చేసుకునే పరిస్థితి లేదన్నారు. పదవీ విరమణ చేసినవారికి చేయాల్సిన చెల్లింపులు సక్ర మంగా చేయలేకపోవడం రాష్ట్ర పరిస్థితిని తెలియజేస్తుందన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థి తీ లేదు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టే దిక్కులేక కొత్త అప్పులు చేస్తుండడం రాష్ట్ర ఆర్ధిక స్థితికి అద్దం పడుతుందన్నారు.
మూలధన వ్యయం ఎక్కడా లేదు. రహదారులకు మరమ్మతులు చేయడానికి కూడా నిధులూ లేవని ఎద్దే వా చేశారు. ఇవన్నీ శ్రీలంకలో ఉన్న పరిస్థితులను తలపించడం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం ఎవరిదో కేంద్ర ప్రభుత్వమే నిర్ధారించిందని , రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీపై ఎదురుదాడి చేస్తోందని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా, రూ.350 కోట్ల వార్షిక టర్నో వర్ ఉన్న తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ బోర్డు డైరెక్టర్ పదవుల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్నా రు. దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. పోలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు రద్దు చేయాలంటూ బుధవారం తిరుపతి జిల్లా కలెక్టర్‌కు ఆయన లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నాయకులు పోలీసులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ మద్దతు అభ్యర్థులకు అనుకూలంగా నకిలీ ఐడీ కార్డులతో దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దళిత వర్గానికి చెందిన పి.వలముని అనే అభ్య ర్థిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమన్నారు.
రాజారెడ్డి రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల్లో జగన్ రెడ్డి దొంగ బతుకు మరోసారి బయటపడిందన్నారు. దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమ యంలో టీడీపీ నాయకులను గృహనిర్భందం చేసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. దొంగ ఓట్లు వేయ డానికి వచ్చిన వారిని పట్టుకుంటే, వారిని వదిలేసి టీడీపీ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేయడం అరాచక పాలనకు నిదర్శనమన్నారు. దొంగ ఓట్లతో గెలిస్తే దొంగ అంటారే తప్ప నాయకుడనరని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లు వేయిస్తున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. అరెస్టు చేసిన టీడీపీ నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు.