స్పీడ్ న్యూస్ 2
posted on Jul 25, 2023 @ 2:05PM
కేసీఆర్ ను గద్దె దించే వరకూ పోరాటం: ఈటల
11.కేసీఆర్ ను గద్దె దించే వరకు తాము పోరాటం చేస్తామని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. యువతను నిర్వీర్యం చేస్తోన్న చరిత్ర కేసీఆర్ ది అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇంటికి ఇద్దురు వృద్ధులకు పెన్షన్ ఇస్తామన్నారు.
........................................................................................................................................................
కుతుబ్ షాహీ మసీదుపై పిడుగుపాటు
12. హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ మసీద్ పై పిడుగు పడటంతో మినార్ బీటలు వారింది. పిడుగు పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట తదితర ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
...............................................................................................................................................................
పాఠశాలల వేళల్లో మార్పులు
13. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మినహా పాఠశాలల వేళల్లో మార్పులు చేసింది. మంగళవారం నుంచి ప్రాథమిక పాఠశాలలు, ఉదయం గం.9.30 నుండి సాయంత్రం గం.4.15 వరకు ఉన్నత పాఠశాలలు ఉదయం గం.9.30 నుంచి 4.45 వరకు పని చేస్తాయి.
........................................................................................................................................................
పార్లమెంటు ఆవరణలో విపక్షాల నిరసన
14. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ ప్రకటనకు పట్టబట్టడంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు రాత్రంతా పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు.
........................................................................................................................................................
ట్రాక్ బేస్ లోపంతో నిలిచిపోయిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్
15. రైల్వే ట్రాక్ బేస్ లోపం వల్ల కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపల్లి వద్ద ఈ ఉదయం నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసిన అనంతరం బయలుదేరింది.
............................................................................................................................................................
18 మంది డీఎస్పీల బదిలీ
16. 18 మంది డిఎస్పి లను బదిలీ చేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజని కుమార్ నిన్న రాత్రి త్తర్వులు జారీ చేశారు. ఈనెల 31 లోగా ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ఈ బదలీల ప్రక్రియ సాగుతోంది.
........................................................................................................................................................
17. హైదరాబాద్ మలక్ పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒకే ట్రాక్ పైకి రెండు లోకల్ ట్రైన్స్ ఎదురెదురుగా వచ్చాయి. అప్రమత్తమైన లోకో పైలట్లు ట్రైన్లను ఆపి వేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రైల్వే శాఖ అంతర్గతంగా విచారణ జరుపుతున్నది.
......................................................................................................................................................
మేఘాలమ పీఎం కార్యాలయంపై దాడి
18.మేఘాలయ సీఎం కన్నాడ్ సంగ్మా కా ర్యాలయంపై దాడి జరిగింది. తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు ఆందోళనకారులు సీఎం కార్యాలయాన్ని ముట్టడించి రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి.
...........................................................................................................................................................
ఆన్ లైన్ లో సబ్సిడీ ధరకు టమాటా
19. కేంద్రం సబ్సిడీపై కిలో టమాటోలను 70రూపాయలకే ఆన్‌లైన్‌లో అందిస్తోంది. టమాటా ధరలు ఆకాశానికి అంటిన నేపథ్యంలో ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ సంస్థ ఆన్‌లైన్‌లో నెట్‌వర్క్ ద్వారా కిలో రూ.70లకే టమోటాలను అందిస్తోంది.
..............................................................................................................................................................
ఎమ్మెల్యే రాజేంద్రసింగ్ గూడాపై దాడి
20. రాజస్థాన్ అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీకే చెందిన ఎమ్మెల్యేపై దాడికి దిగారు. తన వద్ద రెడ్ డైరీ ఉందని, సీఎం అశోక్ గహ్లోత్ కు సంబంధించిన నగదు లావాదేవీల గురించి అందులో ఉందని చెప్పి మంత్రి పదవి పోగొట్టుకున్న రాజేంద్ర సింగ్ గుడాపై ఈ దాడి జరిగింది.
......................................................................................................................................................
కూనేటివాగుకు వరద పోటు
21.ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మెంటాడ మండలం కొండలింగాలవలసలోని కూనేటి వాగుకు వరద ఉద్ధృతి పెరగడంతో కొండలింగాలవలస పరిధిలోని 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
.................................................................................................................................................
కట్టలేరు వాగుకు వరద ఉధృతి
22. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో వినగడప వద్ద కట్టలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ వైపు వచ్చే వాహదారులు ఇబ్బందులు పడుతున్నారు.
.........................................................................................................................................................
30న పీఎస్‌ఎల్‌వీ-సి56 ప్రయోగం
23.ఈ నెల 30న పీఎస్‌ఎల్‌వీ-సి56 ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన 351.9 కిలోల డీఎస్-ఎస్‌ఏఆర్ సహా ఆర్కేడ్, ఎలోక్స్-ఏఎం, ఓఆర్‌బీ-12 స్ట్రైడర్, గెలాసియా-2, 3యూ, స్కూబ్-2, 3యూ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
......................................................................................................................................................
పవన్ పై రోజా విమర్శలు..చిన్న మెదడు చితికిపోయింది
24. మంత్రి రోజా మరోసారి జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. తిరుపతిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మాట్లాడిన ఆమె పవన్ కళ్యాణ్‌కు చిన్న మెదడు చితికిపోయిందని, అందుకే వాలంటీర్లపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
........................................................................................................................................................
భారీ వర్షాలకు గుజరాత్ లో కుప్పకూలిన భవనం
25. గుజరాత్ లో భారీ వర్షాల ధాటికి గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఓ రెండు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఆ భవనం శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని దాతర్ రోడ్‌లోని కడియావాడ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.