స్పీడ్ న్యూస్ 1
posted on Jul 20, 2023 @ 2:07PM
యువతను మోసం చేసిన జగన్
1. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర బుధవారం కనిగిరి నియోజకవర్గంలో సాగింది. ఆయన పాదయాత్ర బుధవారం 2100 కీలోమీటర్ల మైలు రాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను జగన్ మోసం చేశారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకా ఏటా జాబ్ క్యలెండర్ విడుదల చేస్తామన్నారు.
........................................................................................................................................................
ఆసియాకప్ షెడ్యూల్ విడుదల
2. ఆసియా కప్ 2023 షెడ్యూల్‌ను బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధిపతి జై షా బుధవారం ప్రకటించారు. ఈ టోర్నీలో భాగంగా భారత్-పాకిస్థాన్ పోరు సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీలో జరగనుంది. ఆరు దేశాలు పాల్గొనే ఈ టోర్నీ ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది.
.....................................................................................................................................................
కేసీఆర్ రాజకీయ జీవితానికి ముగింపు
3.ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయంగా రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. జాతీయస్థాయిలో కేసీఆర్ ఏ కూటమిలో ఉన్నారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణను పరిపాలించే సత్తా లేకే కేసీఆర్ జాతీయ రాజకీయాంటున్నారని ధ్వజమెత్తారు. ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఈటల కలిశారు.
.......................................................................................................................................................
ఈటలకు బీజేపీ హైకమాండ్ మందలింపు
4.బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ను ఆ పార్టీ అధిష్ఠానం మందలించింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో ఈటల నిన్న భేటీ అయ్యారు. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరుతానని ఈటల చెప్పారు. అయితే రాజాసింగ్ ను కలవడాన్ని తప్పుపట్టిన అధిష్ఠానం ఈటలను మందలించినట్లు సమాచారం.
..................................................................................................................................................
అమిత్ షాతో పవన్ భేటీ
5. ఎన్డీయే సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన జనసేనాని పవన్ కల్యాణ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నిన్న భేటీ అయ్యారు. వీరి మధ్య వివిధ అంశాలపై దాదాపు పావుగంట చర్చ జరిగింది. అనంతరం పవన్ కల్యాణ్ ఒక ట్వీట్ లో అమిత్ షాతో తన చర్చలు చర్చలు ఏపీ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక సుసంపన్నమైన భవిష్యత్తుకు నాంది పలుకుతాయన్నారు.
.....................................................................................................................................
బీఆర్ఎస్ కు గద్వాల జడ్పీ చైర్ పర్సన్ రాజీనామా
6. బీఆర్ఎస్ కి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్ సరిత రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధిష్ఠానానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆమె ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
....................................................................................................................................
విమానంలో ఆక్సిజన్ మాస్క్
7. విమానంలో ఆక్సిజన్ మాస్క్ తో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఫొటోను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మొన్న సాయంత్రం సోనియా, రాహుల్ ప్రయాణీస్తున్న విమానం భోపాల్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆక్సిజన్ తగ్గి, ఒత్తిడి పెరగడంతో సోనియా ఆక్సిజన్ మాస్క్ ధరించారు.
.................................................................................................................................
గ్రీన్ చానెల్ ద్వారా కిమ్స్ కు ఊపిరితిత్తులు
8. విజయవాడ నుండి ఇండిగో విమానంలో హైదరాబాద్ కు ఊపిరితిత్తుల ను తరలించారు. వాటిని విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ నుండి కీమ్స్ ఆస్పత్రికి తరలించేందుకు ట్రాఫిక్ ఏసీపి ఆధ్వర్యంలో గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి ఎటువంటి అంతరాయం లేకుండా చూశారు.
.........................................................................................................................................................
9. వైసీసీ నుంచి బహిష్కృతురాలైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. త్వరలో ఆమె గుంటూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ కు పాల్పడ్డారంటూ వైసీపీ ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే.
..............................................................................................................................................
గుజరాత్ లో నడిరోడ్డుపై మొసలి
10.భారీ వర్షాలకు సముద్రాలు, నదుల్లో ఉండాల్సిన మొసళ్లు జన జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. గుజరాత్ లోని గిర్ జిల్లాలో ఒక పెద్ద మొసలి ఇండ్ల మధ్యలోకి రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అటవీ అధికారులు ఆ మొసలిని బంధించి సురక్షిత ప్రాంతంలో వదిలేశారు.