స్పీడ్ న్యూస్ 4
posted on Jul 17, 2023 @ 5:04PM
31. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముఖచిత్రం మారిపోయిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. ఉజ్వల పథకం కింద దేశంలో పది కోట్ల మందికి మోడీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారని ట్వీట్ చేశారు. మహిళలు పొగపొయ్యిలతో ఇబ్బందులు పడే రోజులు పోయాయన్నారు.
..............................................................................................................................................
32. రాహుల్ గాంధీకి వడ్లకు, ఎడ్లకు తేడా తెలియదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ ప్రాసకోసం పాకులాడే గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అంటూ ఎద్దేవా చేశారు. వ్యవసాయం అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
...............................................................................................................................................................
33. ఇచ్చిన హామీలను అమలు చేయనందున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
.......................................................................................................................................
34. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్ కు శ్రీకారం చుట్టింది. తొలుత కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్ ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది.
............................................................................................................................................................
35. అన్నమయ్య జిల్లా నవాబుకోటలో టమోటా సాగు చేసే రైతు మధుకర్ దారుణ హత్యకు గురయ్యారు. తన టమోటా పంటకు కాపలాగా పడుకున్న మధుకర్ ను దుండగులు పొలంలోనే గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.
...............................................................................................................................................................
36. విజవాడ ధర్నా చౌక్ లో సహకార సంఘాల ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, జీవో 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
..........................................................................................................................................................`
37. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఓ కేసుకు సంబంధించి పోలీసులు అదుపులో ఉన్న సెక్యూరిటీ గార్డు మరణించాడు. ఆదివారం ఉదయమే అతడు లాకప్ లో మరణించగా సాయంత్రం వరకు పోలీసులు నిందితుడు మరణించిన విషయాన్ని గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
..........................................................................................................................................................
38. గుంటూరు హిందూ కళాశాల కూడలిలో తెలుగుదేశం బీసీ నాయకుల ఆందోళన చేపట్టారు. బాపట్ల జిల్లాలో హత్యకు గురైన పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
............................................................................................................................................................
39. ఏలూరు ఎస్పీ కార్యాలయం వద్ద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచ్ ను ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వాడుకున్న 14, 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలంటూ నినాదాలు చేశారు.
........................................................................................................................................................
40. వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ నాలుకను వెయ్యిసార్లు కోస్తామంటూ సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.