స్పీడ్ న్యూస్ 2
posted on Jul 17, 2023 @ 11:43AM
11. బెంగళూరులో నేడూ రేపు బీజేపీయేతర పక్షాల సమావేశం జగరనున్నది. అయితే తొలి రోజు ఈ సమావేశాలకు విపక్ష కూటమి ప్రయత్నాలలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ డుమ్మా కొట్టారు.
...............................................................................................................................................................
12. తూర్పు ఫ్రాన్స్‌లోని ఆల్సేస్ ప్రాంతంలో తన ఇంటి టెర్రస్‌పై కూర్చుని స్నేహితురాలితో కలిసి కాఫీ తాగుతున్న మహిళపై ఓ ఉల్క పడింది. ఉల్క తనను తాకగానే షాక్ కొట్టినట్లు అయ్యిందని ఆమె చెప్పింది. ఆ ఉల్క సిమెంట్ రాయిలా వింత రంగులో ఉంది.
..........................................................................................................................................................
13. విపక్షాల కూటమికి హాజరౌతున్న ఆప్. కేంద్రం ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడంతో ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది. గత నెలలో జరిగిన సమావేశానికి హాజరైన ఆప్ కాంగ్రెస్ కేంద్రం ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని షరతు విధించిన సంగతి తెలిసిందే.
.........................................................................................................................................................
14. తమిళనాడులో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడి ఇళ్లపై ఈ ఉదయం అధికారులు దాడులు చేశారు. మంత్రి వి. సెంథిల్‌బాలాజీ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
........................................................................................................................................................
15.వర్ధన్నపేట బస్టాండ్ లో ఆగివున్న ఆర్టీసి బస్సును డీసీఎం వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎంలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలు గాయపడ్డారు.
...............................................................................................................................................................
.16. ఈ నెల 20న నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వేదికగా నిర్వహించనున్న పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ వాయిదా పడిది. కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో ఈ సభను వాయిదా వేశారు.
...............................................................................................................................................................
17. గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందనప్పటికీ గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ ఆవరణలో బోనాల పండుగ నిర్వహించి బోనం ఎత్తి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
............................................................................................................................................................
18. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించారు. సర్వభూపాల వాహనంపై ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఆణివార ఆస్థానం తమిళులకు అత్యంత ప్రీతివంతమైన రోజు అని తెలిసిందే.
............................................................................................................................................................
19. నరసరావుపేటలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణ నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేశారు. ఘర్షణలపై ఇంకా పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఘర్షణకు కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
...............................................................................................................................................................
20. వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ కర్నూలులో క్లీన్ ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లు నిరసన దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో డ్రైవర్లు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు.