సౌరవ్ గంగూలీ కి బిజెపి గాలం..!
posted on Dec 14, 2013 @ 1:52PM
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్వరలో క్రీడల మంత్రి కాబోతున్నడా? అంటే అవుననే మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ బిజెపి లో చేరవలసిందిగా గంగూలికి ఆహ్వానం పంపించారట. ఎంపీగా గెలిస్తే క్రీడామంత్రిత్వ శాఖ ఇస్తానని ఆయనకు ఆఫర్ కూడా ఇచ్చారట. తమ పార్టీ ప్రతిపాదనపై త్వరలోనే నిర్ణయం తెలియచేస్తాను అని గంగూలీ స్పందించినట్టు బీజేపీ నేతలు వెల్లడించారు.
42 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో తృణాముల్ కు తగినంత పోటీ ఇవ్వడానికి గంగూలీని రంగంలోకి దించాలని బిజెపి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ పరిశీలకుడిగా ఉన్న వరుణ్ గాంధీని ఓ మిత్రుడి ద్వారా గంగూలీ కలిశారట. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలు బయటకు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో పాగా వేసేందుకు మోడి నిరంతర కసరత్తు చేస్తున్నారు. ఖచ్చితమయిన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి రావాలని మోడీ భావిస్తున్నారు.